Nita Ambani Fitness Secret: నీతా అంబానీ 50 రూపాయల జ్యూస్ ఎందుకు తాగుతోంది, ఆమె అందం సీక్రెట్ ఏంటి
స్టామినా
బీట్‌రూట్ జ్యూస్‌లో నైట్రేట్స్ పుష్కలంగా ఉండి కండరాలకు ఆక్సిజన్ సంపూర్ణంగా అందేలా చేస్తుంది. దీంతో స్టామినా పెరుగుతుంది. అందుకే అథ్లెటిక్స్, జిమ్ వెళ్లేవాళ్లు బీట్‌రూట్ జ్యూస్ తప్పకుండా తాగుతారు
జీర్ణక్రియ మెరుగుపర్చడం
బీట్‌రూట్ జ్యూస్‌లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఎనీమియా
బీట్‌రూట్ జ్యూస్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎనీమియా రాకుండా కాపాడుతుంది. ఎనీమియా రోగులకు బీట్‌రూట్ జ్యూస్ చాలా మంచిది
గుండె ఆరోగ్యం
బీట్‌రూట్ జ్యూస్‌లో ఫైబర్, పొటాషియం, నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తాయి. హార్ట్ ఎటాక్ ముప్పును తగ్గిస్తాయి.
బ్లడ్ ప్రెషర్ నియంత్రణ
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్ బ్లడ్ ప్రెషర్ తగ్గించేందుకు దోహదం చేస్తాయి. రోజూ క్రమ పద్ధతిలో బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.