Black Guava For Diabetes: మధుమేహాన్ని శాశ్వతంగా చెక్‌ నల్ల జామ పండ్లు..వీటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Sun, 09 Jul 2023-10:58 am,

నల్ల జామ పండ్లు శరీరానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భారత్‌లో ఈ పండ్లు చాలా అరుదుగా కూడా లభిస్తాయి. కాబట్టి వీటి ధర కూడా చాలా ఎక్కవగా ఉంటుందని సమాచారం.

నల్ల జామ పండ్లలో గుజ్జు కూడా నల్లగా ఉంటుంది. ఇందులో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి వంటి చాలా రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినడం వల్ల తీవ్ర దర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.  

నల్ల జామలో పీచు ప‌దార్థాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం, పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది.  

తరచుగా రక్త‌హీన‌త సమస్యలతో బాధపడేవారు నల్ల జామను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  

ముఖ్యంగా నల్ల జామను డ‌యాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది. మధుమేహం కారణంగా వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి తీవ్ర డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా ఈ నల్ల జామను తీసుకోవాల్సి ఉంటుంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link