BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్‌, ధర చూస్తే షాక్

Sun, 11 Jul 2021-4:37 pm,

బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS), బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ (BMW R 1250 GS Adventure) బైక్స్ ఎల్ఈడీ అడాప్టివ్ హెడ్‌లైట్ డిజైన్‌తో రూపొందించారు. ఎక్స్ ఆకారంలో లైట్ ఐకాన్స్ అమర్చారు. లైట్లకు సంబంధించిన క్రషింగ్ లైట్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ బల్బులను ఫిక్స్ చేసింది. 

Also Read: WhatsApp Features: మీరు వాట్సాప్ వాడుతున్నారా, అయితే ఈ సరికొత్త ఫీచర్లు మీకోసమే

భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ ప్రో ధర (BMW R 1250 GS Price) రూ.20,45,000 (20 లక్షల 45 వేల రూపాయాలు). బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ బైక్ ధర (BMW R 1250 GS Adventure Price) రూ.22,40,000 (22 లక్షల 40 వేల రూపాయాలు) 

Also Read: EPFO Medical Advance: గంటలో ఈపీఎఫ్‌వో మెడికల్ అడ్వాన్స్‌గా రూ.1 లక్ష సాయం

ఆటోమొబైల్ దిగ్గజం భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ మరియు భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్‌లను బిల్ట్ అప్ యూనిట్స్‌గా విక్రయిస్తున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ పేర్కొన్నారు.

భారత్‌లో బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS) మరియు బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ బైక్ (BMW R 1250 GS Adventure) రెండు రంగులలో అందుబాటులోకి తెచ్చింది. ట్రిపుల్ బ్లాక్ వేరియంట్ మరియు స్టైల్ ర్యాలీ వేరియంట్‌లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది.  40 ఇయర్స్ జీఎస్ ఎడిషన్ కింద పరిమిత సంఖ్యలో స్టాక్ అందుబాటులోకి తెచ్చారు.

Also Read: Samsung Galaxy F22 Price In India: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 రిలీజ్, ధర, ఫీచర్ల వివరాలు

బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ (BMW R 1250 GS) మరియు బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ అడ్వెంచర్ (BMW R 1250 GS Adventure) వేరియంట్ బైకులపై 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు నడిపినా ఈ వారంటీ వర్తిస్తుందని బీఎండబ్ల్యూ ప్రకటించింది. నాలుగేళ్లు మరియు ఐదేళ్లకు వారంటీ పెంచుకునేలా కస్టమర్లకు అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link