WhatsApp Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లు తీసుకొస్తుంటుంది. గత కొన్ని నెలలుగా భారత్‌లో ప్రైవసీ పాలసీ వివాదం ఎదుర్కొంది. ఆ సమయంలోనూ ఫీచర్లను తీసుకురావడంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆండ్రాయిండ్ మరియు ఐఫోన్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు (WhatsApp New Features) తీసుకొచ్చేందుకు వాట్సాప్ కంపెనీ సిద్ధమైంది.
రీడిజైన్డ్ ఇన్ యాప్ నోటిఫికేషన్స్ (Redesigned in-app notifications): పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్ టెక్నాలజీని అప్‌డేట్ చేయడంపై ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్‌ను రీడిజైన్ చేయడానికి కంపెనీ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యాప్ నోటిఫికేషన్లపై కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ బ్యానర్, ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్ మరియు స్టిక్కర్లలో మరింత సమాచారం అందించే దిశగా వాట్సాప్ అడుగులు వేస్తోంది. యాప్ నోటిఫికేషన్‌ను వాట్సాప్ యూజర్లు పెద్దదిగా చేసుకుని ఛాట్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకునే సదుపాయాన్ని (WhatsApp New Feature) అందించడానికి ప్రయత్నిస్తోంది. నోటిఫికేషన్‌లో నేరుగా స్క్రోల్ చేసి పాత మెస్సేజ్‌లు సైతం చూసేలా మార్పులు చేస్తుంది.
Also Read: Whatspp Privacy Policy: వాట్సప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్, ప్రైవసీ పాలసీని నిలిపివేసిన వాట్సప్
వ్యూ వన్స్ ఫీచర్ (View Once Feature):
వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్లలో వ్యూ వన్స్ ఫీచర్ ఒకటి. సాధారణంగా మనం ఎవరికైనా మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్, జీఐఎఫ్ ఇమేజ్ (WhatsApp Stickers Update) పంపితే అవతలి వ్యక్తులు వాటిని ఓపెన్ చేసి ఎన్నిసార్లయినా చెక్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ వ్యూ వన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఉపయోగిస్తే, మీరు పంపించే మెస్సేజ్, వీడియోలు, పొటోలు ఏదైనాగానీ అవతలి వ్యక్తి ఒకసారి చూపి చాట్ నుంచి బయటకు వస్తే చాలు ఆ సమాచారం మాయం అవుతుంది. అయితే మెస్సేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి టెక్ట్స్, ఫొటో, జీఐఎఫ్ మెస్సెజ్‌లను స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కల్పించింది.
Also Read: WhatsApp Stickers: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, టైప్ చేస్తే చాలు కావాల్సిన స్టిక్కర్స్
వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫామ్స్ (Voice Waveforms):
వాట్సాప్ సంస్థ తీసుకురాబోతున్న మరో సరికొత్త ఫీచర్ వాయివ్ వేవ్‌ఫామ్స్. వాయిస్ మెస్సేజ్‌లు వింటున్న సమయంలో వాయివ్ అనేది వేవ్‌ఫామ్ రూపంలో కనిపిస్తుంది. వాట్సాప్ బీటా ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు రెడీ అయింది. ఐఓఎస్ యూజర్లకు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకూ వాయిస్ మెస్సేజ్ వింటుంటే బార్ ముందుకు వెళ్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే తరంగాల రూపంలో మెస్సేజ్ డిస్‌ప్లే అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook