Bollywood Star Kids: సినిమాల్లో డెబ్యూ చేసినా సరైన హిట్ లేని స్టార్ కిడ్స్
సారా అలీ ఖాన్
సారా అలీ ఖాన్ కేదార్‌నాధ్ సినిమాతో డెబ్యూ చేసింది. 2018లో వచ్చిన ఈ సినిమా తరువాత సింబా, కూలీ నెంబర్ 1, గ్యాస్ లైట్, జరా హట్కే జరా బచ్కే, అత్రంగీ, లవ్ ఆజ్ కల్‌లో నటించింది. కానీ సరైన హిట్ మాత్రం లేదు.
జాన్వి కపూర్
శ్రీదేవి, బోని కపూర్ ముద్దుల తనయగా అందరికీ పరిచయమైన పేరు. 2018లోనే డెబ్యూ చేసినా ఇంకా సరైన హిట్ మాత్రం కొట్టలేదు. ధడక్ సినిమా మొదటి సినిమా. గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, రూహీ వంటి సినిమాల్లో కన్పించింది. హిట్ కోసం చూస్తోంది.
ఇషాన్ ఖట్టర్
ఇషాన్ ఖట్టర్ కూడా చాలా సినిమాల్లో నటించాడు. సినిమాలు అందరికీ నచ్చుతున్నా బాక్సాఫీసులో కలెక్షన్లు చేయలేకపోతున్నాయి. ఇటీవల విడుదలైన పిప్పా అందర్నీ ఆకట్టుకుంది గానీ ప్రాచుర్యం పొందలేదు.
హర్షవర్షన్ కపూర్
స్టార్ కిడ్స్ జాబితాలో ముందుగా వచ్చే పేరు ఇది. 2016లో మీర్జా సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అనిల్ కపూర్ కుమారుడు. మొదటి సినిమా ఫ్లాప్. ఆ తరువాత థార్, భావేష్ జోషి సూపర్ హీరోలో నటించినా పెద్దగా ఆ సినిమాలు ఆడలేదు. ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా లేదు.
అనన్యా పాండే
ఫ్లాప్ సినిమాతో ఆరంగేట్రం చేసిన అనన్యా పాండేకు ఉత్తమ నటి అవార్డు వరించింది కానీ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఇంకా నిలదొక్కుకోలేకపోతోంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో మెప్పించింది. అయితే సినిమాలు హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు పెద్దగా లభించలేదు.