Bollywood Fastest 300 Crore Movies: ‘పుష్ప 2’ సహా బాలీవుడ్ లో ఫాస్టెస్ట్ రూ. 300 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన చిత్రాలు..
1.పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా హిందీలో ఫస్ట్ డే మన దేశంలో రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 1లో నిలిచింది. తాజాగా ఈ సినిమా 5 రోజుల్లో రూ. 339 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సంచలనం రేపింది.
2. జవాన్ - Jawan అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జవాన్’. ఈ మూవీ మన దేశంలో ముది రోజు రూ. 65.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా 6 రోజుల్లో రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
3. పఠాన్ - Pathaan
యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై షారుఖ్ హీరోగా సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరెక్కిన చిత్రం ‘పఠాన్’. ఈ సినిమా 7 రోజుల్లో రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మన దేశంలో రూ. 55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
4.యానిమల్ - Animal
రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు రూ. 54.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా కూడా 7వ రోజు రూ. 300 కోట్ల క్లబ్బులో చేరింది.
5. గదర్ 2..
సన్ని దేవోల్ హీరోగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గదర్ 2’. ఈ సినిమా 8 రోజుల్లో రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి టాప్ 5లో నిలిచింది.
6.స్త్రీ 2 .. శ్రద్ధా కపూర్ కథానాయిక యాక్ట్ చేసిన లేడీ ఓరియండెట్ మూవీ ‘స్త్రీ 2’. ఈ మూవీ హిందీ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. 8వ రోజు రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.
7. బాహుబలి 2..
బాహుబలి 2 మూవీతో ఈ సినిమా 8వ రోజున రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
8.కేజీఎఫ్ 2
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2’ చిత్రం.. హిందీ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే మన దేశంలో రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా 11వ రోజు రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
9. అటు దంగల్.. 13 రోజులు. సంజు, టైగర్ జిందా హై.. 16 రోజులు..పీకే సినిమా 17 రోజులు.. వార్ మూవీ 19 రోజులు.. భజరంగీ భాయిజాన్ - 20 రోజులు.. సుల్తాన్ 35 రోజుల్లో రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.