Karthika Deepam Serial Today December 12: ఈ ఎపిసోడ్ జ్యోతో ప్రారంభమవుతుంది.." రాత్రంతా బావని ఇలాగే చూస్తూ ఉండాలని ఉంది. కానీ రేపు రావాలంటే ఇప్పుడు వెళ్లాలి కదా చాలు దీపను బావని.. ఆల్మోస్ట్ 14 అవర్స్ దూరంగా ఉంచాను. ఈ నెంబర్ స్లోగా పెంచుదాం..అప్పుడు 24 అవర్స్ బావ నా ముందే ఆఫీస్ లోనే ఉంటాడు" అని జో మనసులో అనుకుంటుంది.. డ్రైవర్ నువ్వు కార్ తీసుకుని వెళ్ళిపో.. మా బావతో వస్తాను.. నువ్వు వెళ్ళు అని డ్రైవర్ తో జో అంటుంది. ఆ తర్వాత జో కార్తీక్ దగ్గరికి వెళ్లి వర్క్ ఇంకా కంప్లీట్ కానట్టు ఉంది.. ? అని వింతగా ప్రశ్న అడుగుతుంది. బ్యాలెన్స్ వర్క్ టుమారో కంప్లీట్ చేయొచ్చు.. పద బావ ఇంటికి వెళ్దామని కార్తీక్ ని అంటుంది. కార్తీక్ చెప్పింది వినకపోవడంతో.. మరోసారి జో బావ చెప్పేది నీకే ఇప్పటికే చాలా లేట్ అయింది.. మార్నింగ్ వర్క్ చేసుకుందాం" అంటుంది.
పది నిమిషాల తర్వాత కార్తీక్ మై వర్క్ ఇస్ ఫినిష్.. ఫైల్ మెయిల్ చేశాను చెక్ చేసుకోండి సీఈఓ గారు.. అని జోని కార్తీక్ అంటాడు. జో కార్తీక్ ను మరోసారి పద బావ ఇంటికి వెళ్దాం.. ఆఫీసులో ఏమీ తినలేదు కార్లో వెళ్తూ అలా అలా ఏమైనా తిందాం అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నా వర్కింగ్ గా ఫినిష్ అవలేదు మరో రెండు నిమిషాల పాటు టైం పడుతుంది అని జ్యో చెబుతాడు. అయితే జో అప్పుడు ఓకే బావ అని జో నేను నీతో వస్తానని అంటుంది. నా కార్ లేదు నువ్వే డ్రాప్ చేయాలి అని జో కార్తీక్ కి చెబుతుంది. ఇంతలోనే కార్తీక్ కి దీపా నుంచి ఫోన్ వస్తుంది.
ఇప్పుడు జోష్ణ తో ఆడుకుంటాను చూడు బలే టైం ఫోన్ చేసావ్ తప్పా? నేను ఇప్పుడు జోష్ణ తో ఆడుకుంటాను చూడు.. మా ఆవిడ ఫోన్ చేసిందంటూ.. దీపా తో కార్తీక్ ఫోన్ మాట్లాడటం ప్రారంభిస్తాడు.. దీపా చెప్పు నేను రాలేదని భోంచేయకుండా ఇంటి బయట వెయిట్ చేస్తున్నావా.. థిస్ ఇస్ టూ మచ్ దీప. ఎన్నిసార్లు చెప్పాలి టైం కి భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది.. నీకేద నైతే నేను తట్టుకోగల్నా.. ఆఫీస్ లో వర్క్ అయిపోయింది కాసేపట్లో బయలుదేరిపోతాను.. ఈరోజు ఎందుకు ఎంత లేట్ అయింది అంటావా.. మంచి క్వశ్చన్ అడిగావు దీప.. కొత్త సీఈఓ గారు చాలా మంచివారు.. మా కొత్త సీఈఓ గారు చాలా మంచివారు.. త్రీ మంత్స్ లో కంప్లీట్ చేయాల్సిన వర్క్ ని ఈ ఒక్క రోజులోనే చేయించేశారు. ఇంకేంటి ఈరోజు ఏం కర్రీ వండావు.. పాలక్ పన్నీరా సూపర్ సూపర్.. అదంటే ఇద్దరికీ చాలా ఇష్టం కదా..! వినపడాలా చెప్పు.. మల్లెపూలా.. అది నువ్వు ఫోన్ చేసి గుర్తు చేయాలో చెప్పు.. తీసుకొస్తా.. రేపా రేపు నేను ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు.. ఆఫీస్ రూల్ ప్రకారం ఇలా ఓవర్ టైం వర్క్ చేస్తే నెక్స్ట్ తీసుకోవచ్చు.. అని దీపా తో కార్తీక్ ఫోన్లో మాట్లాడుతాడు..
అప్పుడు దీప.. జోష్న పక్కనే ఉందేమో తను నేర్పించడానికి ఇలా మాట్లాడారు అనుకుంటా.. అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే జోక్ ఫోన్ కాల్ లో మాట్లాడుకుంది మొత్తం తిని.. మీ ప్రేమ ముచ్చట్లు అయ్యాయా..? బావ.. లేట్ అయింది కదా..ఇంటికి బయలుదేరుదామా అని మళ్లీ అడుగుతుంది.. అప్పుడు కార్తీక్ బాబు నా కారులో నేను వెళ్తా నీ కారులో నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు.. జో అప్పుడు నాకు కార్ లేదని నీకు ముందే చెప్పాను కదా అని.. నన్ను డ్రాప్ చేయొచ్చు కదా అని కార్తీక్ బాబును పదేపదే అడుగుతూ ఉంటుంది. కార్తీక్ బాబు నేను ఎందుకు డ్రాప్ చేయాలని నేనెందుకు క్యూస్షన్ వేస్తాడు.. అప్పుడు జో నేను నీ కారులో వస్తే మీ ఆవిడ ఏమైనా ఫీలవుతుందా.. అని కార్తీక్ బాబును అంటుంది..
కార్తీక్ బాబు జోను.. ఇందాక ఏంటి అన్నావ్ అర్జెంటుగా ఇంటికి వెళ్లాలంటే ఎవరికోసం అన్నావు కదా.. ఇప్పుడు చెప్తా విను.. మా ఆవిడ కోసం ఇంటికి వెళ్లాలి అంటూ కార్తీక్ అంటాడు.. మా ఆవిడ వెయిటింగ్.. వచ్చేస్తున్న కదా.. దీప దీప.. మై డియర్ దిపా.. అంటూ కార్తీక్ బాబు సాంగ్స్ పాటు అక్కడనుంచి వెళ్తాడు. అప్పుడు జోకి కోపం వచ్చి.. నేను నిన్ను నా కంట్రోల్ లో పెడుతున్నాడు లేదు ..నువ్వే నన్ను టార్చర్ పెడుతున్నట్టుంది.. దీపా దీపా అని కోపంగా బల్లపై తన చేతులతో గట్టిగా కొడుతుంది.
ఇక దీప కార్తీక్ కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉంటుంది.. తన కార్లు కార్తీ బాబు ఇంటికి అప్పుడే వచ్చేస్తాడు.. బాల్కనీలో దీప ఒంటరిగా పడుకోవడం చూసి.. దీపా.. దీప.. అని దీపన నిద్రలేపుతాడు.. దీపాలేచి కార్తీక్ బాబు ఇప్పటిదాకా నీకోసం మెల్కువగా ఉన్నాను అని అంటుంది.. ఎప్పుడు నిద్ర పట్టిస్తుందో తెలీదు.. మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను.. ప్రెషర్ అయ్యి రండి భోజనం చేస్తారు కానీ దీపా కార్తిక్ బాబుతో అంటుంది..
ఇంతలోనే కార్తీక్ బాబు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు.. వచ్చి.. సౌర్య భోంచేసిందా.. టాబ్లెట్స్ వేసుకుందామని దీపాను అడుగుతాడు.. నువ్వు కూర్చో దీప బోన్ చేద్దామని అంటాడు.. నువ్వు భోంచేయలేదా నాకు తెలుసు.. కూర్చో.. అని దీపాను అంటారు కార్తీక్.. ఇక ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలోనే భోజనం అయిన తర్వాత.. కార్తీక్ బయట ఉన్న బాల్కనీలో చేర్లో కూర్చుని తలనొప్పితో ఉండడం బాధపడుతున్నట్లు గమనించి దీపావచ్చి జండుబాంబుతో కార్తీక్ తలకు మసాజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది..
ఇదే టైంలో జోష్ణ గురించి మళ్లీ టాపిక్ వస్తుంది.. అప్పుడు దీప జోష్ణకు మీరు కావాలి అని కార్తీక్ బాబును అంటూ ఉంటుంది. ఇంతలోని కార్తీక్ బాబుకు చిరాకు వచ్చి.. నీ మాటలు వింటుంటే నా తలనొప్పి మరింత పెరుగుతుందని దీపా చేతిలో నుంచి రెండు జండుబాంబులక్కొని.. కార్తీక్ బాబాయ్ తనకు రాసుకుంటాడు. అది కాదు కార్తీక్ బాబు.. మీ ఇద్దరికీ చిన్నప్పటినుంచి పెళ్ల అనుకున్నారు కదా.. అని దీపా అంటుంది.. ఇంతలోనే కార్తీక్ బాబు స్పందిస్తూ.. పెద్దవాళ్లు అనుకున్నారు.. పిల్లలు అనుకోలేదు.. నేను జోష్ణను మరదలు గాని చూసాను.. పెళ్లి చేసుకోనని నీతో కూడా చెప్పానని కార్తీక్ బాబు అంటాడు.. కానీ నువ్వేమన్నావ్.. మీ అమ్మగారి గురించి ఆలోచించాలి ఆవిడు సంతోషం కోసం.. ఆవిడ మీ మావయ్య గారి దగ్గర తీసుకున్న మాట కోసం మీరు పెళ్లి చేసుకోవాలి అన్నావ్.. నువ్వు తర్వాతే నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు మా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా.. కానీ మా తాత అది కూడా దూరం చేశాడు.. మాటిచ్చిన వాళ్లే వల్లే మాట మీద నిలబడాల్సిన వాళ్లే మీరు మాకొద్దు అంటే ఏం చేయమంటావు.. భగవంతుడు కూడా తెలిస్తే తెలిసింది.. కలవని మనసులు కలిసి బతకలేవని.. నా మనసుకు నచ్చిన పని చేయమని నువ్వు చెప్పావు కదా.. తొందరలోనే చేయబోతున్నాను.. ఆ తర్వాత పెయిన్ బాబుతో పని ఉండదు ఇంత లేటుగా ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు.. అని దీపా తో కార్తీక్ బాబు అంటాడు. అప్పుడు దీపా మనసులో... కార్తీక్ బాబు ని చూస్తుంటే ఏదో పెద్ద నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు.. అది మళ్ళీ ఏ సమస్యకు దారితీస్తుందోనని దీపా అనుకుంటూ ఉంటుంది..
ఇంతలోనే తెల్లారిపోయి.. మళ్లీ కథ జో దగ్గరికి వస్తుంది.. ఇందులో గ్రానీ జో సన్నివేశాలుంటాయి.. గ్రానీ జోనీ నువ్వు దీప కోసం రౌడీలను పురమాయించిన విషయం నాకెందుకు చెప్పలేదు అని అంటుంది.. సిచువేషన్.. ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండవు గ్రానీ.. అది నువ్వు అర్ధం చేసుకోవాలి అని జో అంటుంది. నువ్వు నాకు చెప్పుకునే ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావ్.. అన్ని నీకు నచ్చినట్టే చేస్తావ్ అనుకుంటున్నావా అని గ్రానీ.. జో క్యూస్షన్ చేస్తుంది.. గీత కార్తీక్ బాబు ఇద్దరు కలిసి కాపురం చేస్తుంటే మీరు కారాలు మిరియాలు నూరుతున్నారు అని గ్రానీని జో అంటుంది.. అప్పుడు గ్రానీ వాళ్లకు ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు కదా? అని ఎంతో సిల్లీగా అంటుంది.. అయితే ఇంతలోనే జోకి కోపం వచ్చి మీరు వెళ్లి చేయండి కదా! అని అంటుంది.. అప్పుడు గ్రాని అది కాదే అని జోకి నచ్చజెప్పేలా చేస్తుంది.
అప్పుడు జోక్ గ్రానీతో..నేను అన్ని ఆలోచించే నా లైన్ క్లియర్ అవ్వాలంటే దీపం ఉండకూడదని డిసైడ్ అయ్యాను.. కంపెనీకి నేను సి ఈ ఓ గా ఉంటే బావకి నేను దగ్గరగా ఉండొచ్చు.. నేను దగ్గరగా ఉండొచ్చు నా ప్రేమని బావకి అర్థమయ్యేలా చెప్పొచ్చు అనుకున్నాను.. కానీ బాబు మాత్రం పదేపదే దీప పేరు చెప్పి నన్ను నన్ను ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నాడు.. రాత్రి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే కారులో లిఫ్ట్ కూడా ఇవ్వలేదు తెలుసా నీకు అని గ్రానీతో జో చెబుతుంది. లిఫ్ట్ ఇవ్వలేదు వాడు లైఫ్ ఎలా ఇస్తాడు.. బావ కంటికి నేను కనిపించాలంటే దీప కనిపించకూడదు గ్రానీ అని అంటుంది.. అందుకే దానికి కావలసిన ఏర్పట్ల చేశాను..
ఇంతలోనే మేడం నమస్తే అంటూ ఓ రౌడీ వస్తాడు.. అయితే జో ఆ రౌడీని పట్టుకొని చెప్పిన టైంకి రానివానివి చెప్పిన పని ఎలా చేస్తావ్ అని ప్రశ్న సంధిస్తుంది. అప్పుడు ఆ రౌడీ స్పందిస్తూ.. నా ట్రాక్ తెలిస్తే నా పక్కనుండి చూడడానికి కూడా భయపడతారు అంటాడు. రౌడీ కి జో దీప ఫోటో ఇచ్చి.. చంపమని అడుగుతుంది. అప్పుడు రౌడీ మేడం మీరు డబ్బు రెడీ చేసుకోండి మీ పని తొందరలోనే పూర్తవుతుందని మాట ఇస్తాడు. అంతేకాకుండా అక్కడున్న గ్రానీ ఇదంతా చూసి ఆశ్చర్య పోతుంది.. జోనీ ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడుగుతుంది.. ప్రేమ కోసం, పగ కోసం ఇదంతా చేస్తున్నానని సమాధానం జో ఇస్తుంది. ఇంతలోనే ఆ రౌడీ పాప గ్రౌండ్లో పడిపోయిందంటూ దీప కి ఫోన్ చేస్తాడు.. మీరు మాత్రం తొందరగా గ్రౌండ్ కి రండి అని రౌడీ అంటాడు.. దీప ఇంటి నుంచి హుటాహుటిన బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.