Star kids Craze: బాలీవుడ్‌లో అడుగుపెట్టకుండానే ఫుల్ ఫాలోయింగ్‌లో స్టార్ కిడ్స్
నీసా దేవగణ్
నీసా దేవగణ్..బాలీవుడ్ స్టార్ నటీ నటులైన అజయ్ దేవగణ్, కాజోల్ ముద్దుల కూతురు. ఫ్యాషన్ స్టైల్, బోల్డ్‌నెస్, పార్టీలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. సినిమాల్లోకి వస్తుందా లేదా అనేది ఇంకా ఇప్పటి వరకూ తెలియదు. కానీ ఇప్పట్నించే స్టార్ అయిపోయింది.
నవ్యా నవేలీ
సినిమా ఇండస్ట్రీలో పేరున్న కుటుంబం నుంచి వచ్చిన నవ్యా నవేలీకు నటనపై ఆసక్తి లేదు. ఈమె ఒక యువ పారిశ్రామికవేత్త. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంటుంది.
ఐరా ఖాన్
అమీర్ ఖాన్ ముద్దుల కూతురు ఐరా ఖాన్. నటనపై ఈమెకు ఏ మాత్రం ఆసక్తి లేదు. కానీ కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది.
ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ జిరాక్స్ కాపీలా ఉండే అతని కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. గుడ్ లుక్స్ ఒక కారణమైతే పటౌడీ కుటుంబ నేపధ్యం మరో కారణంగా ఉంది. సినిమాల్లోకి రాకుండానే స్టార్ అయిపోయాడు.
ఆలియా కాశ్యప్
అనురాగ్ కాశ్యప్ కుమార్తె ఆలియా కాశ్యప్ చాలామందికి తెలియదు. అయినా తరచూ సోషల్ మీడియాలో ఉంటోంది. బాయ్ ఫ్రెండ్ కలిసి రిలేషన్ షిప్‌లో ఉండినా లేదా పార్టీల్లో హల్‌చల్ చేసినా ఆమె తరువాతే ఎవరైనా.