Brahmamudi: ఆస్తి కోసం గుంటనక్కలా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు.. కావ్య కాళ్లు పట్టుకుంటారా?
ఈ ఆస్తి ఐశ్వర్యం నీ చేతికి వచ్చిందంటే ఆ స్వామి ఆశీర్వాదం కాదనకుండా బాధ్యత తీసుకో అంటుంది. అప్పుడే కావ్య మామ, అత్త కూడా ఎంట్రీ ఇస్తారు. చాలా ఆనందంగా ఉంది. ఆపాత్ర దానం కాలేదు. మానాన్న దూరంగా ఆలోచించి యావదాస్తి నీపై రాశాడు నాన్న. ఇంతకంటే పరిష్కారం లేదు అంటాడు. మావయ్య గారు చిన్న అత్తయ్య కోర్టుకు వెళ్తా అంటోంది. వారిని ఆపడం నా వల్ల అవుతుందా? అంటుంది కావ్య. ధైర్యంగా ముందుకు వెళ్లు నీకు నీ అత్తామామ సపోర్ట్ మాత్రమే కాదు మా అత్తామామ సపోర్ట్ కూడా ఉంటుంది అపర్ణ. చేతికి ఇంటి తాళాలు, పత్రాలు ఇస్తారు. కంగారు పడుతూనే వాటిని తీసుకుంటుంది.
ఇక నుంచి ఆస్తులు మాత్రమే కాదు ఇంటి బాధ్యత అప్పగిస్తున్నాం. దుగ్గిరాలవారి గౌరవం అంటుంది అపర్ణ. నాకు కత్తి మీద సాములు ఉంటుంది కావ్య. ఈ ఇల్లు, ఆస్తి, కుటుంబం ఎప్పుడూ ముక్కలు కాకుండా మా బావ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటుంది ఇందిరా దేవి. ధైర్యంగా ఉండూ అని అందరూ వెళ్లిపోతారు.
బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది పత్రాలు, తాళాలు పట్టుకుని కావ్య. రాజ్ ఏంటివి? అంటాడు. ఏం లేదండి ఇంటి తాళాలు, పత్రాలు నాకు ఇచ్చి జాగ్రత్త అమ్మ అనింది. ఈ భారం నా వల్ల కాదు. అందుకే ఇక్కడకు తెచ్చాను. ఏవి ఎక్కడకు చేర్చాలో అక్కడకు చేరాయి అని వెళ్లిపోబోతుంది. ఏంటి కామెడీ చేస్తున్నావా? అంటాడు రాజ్.. ఈ ఇంట్లో అందరికంటే నువ్వే సమర్థురాలివి బాధ్యతలు తెలిసినదానివి అందుకే తాతయ్య ఆస్తి రాశాడు అంటాడు రాజ్
తాతయ్య వచ్చాక చెబుతా ఇప్పుడైతే మీరే తీసుకోండి అంటుంది. నేను దానం తీసుకోను నేనే సంపాదించుకుంటా అంటాడు రాజ్. నా ఆస్తి కాదు కదా అంటుంది కావ్య. కళావతి.. నీకు నిజం చెప్పాలనుకున్నా.. నేను ఆవేశంతో మాట్లాడట్లేదు.. ఆలోచించే చెబుతున్న ఒక రకంగా ఈ బాధ్యతలు నీ చేతిలో ఉంటేనే సేఫ్‌గా ఉంటాయి. తాతయ్య నమ్మకం నిలబెట్టుకుంటావు అనుకుంటా అని వెళ్లిపోతాడు. ఆశ్చర్యపోవడం కావ్య వంతు అవుతుంది.
రుద్రాణీ రాహుల్ గగ్గోలు షరామాములే. ఇద్దరూ గదిలో పన్నాగాలు వేస్తారు. కావ్య ఆస్తిరాయించుకుని షాక్ ఇచ్చింది.. చేతికి చిప్పిచ్చింది అంటాడు రాహుల్.. బ్యాగ్రౌండ్ సౌండ్ 'అనుకున్న ఒకటి అయినది ఒక్కటి' అని ప్లే చేస్తుంది స్వప్న. ఊరేసుకుని చచ్చి నీపై వేస్తానే చాలు ఆపు అంటంది రుద్రాణీ. మొత్తం ఆస్తి నీ చెల్లెలు నొక్కేసింది రాహుల్ ఆస్తి నీ ఆస్తి కాదా? అంటుంది. చేయి చాచి ఆడుక్కోవాలి మీ చెల్లి దగ్గర అంటుంది రుద్రాణీ. దాని చేతి నుంచి తిరిగి ఎలా ఆస్తి లాక్కోవాలో నాకు తెలుసు అంటుంది. ఖర్చులకు నిజంగానే మనం కావ్య కాళ్లు పట్టుకోవాలా? మామ్ అంటాడు రాహుల్. నేనేం చేస్తానో చూడు అంటుంది రుద్రాణీ.
మరోవైపు ధాన్యం కావ్య మీద కేసు వేయడానికి లాయర్‌తో ఫోన్లో మాట్లాడుతుంది. వెంటనే ప్రకాశం సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. కల్యాణ్ వదిన మీద కేసు వేయడు నీకు ఏ అధికారం ఉందని కేసు వేస్తావు వెర్రి ధాన్యలక్ష్మి..అంటాడు. నీ బాధ తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అంటాడు.
ఇక హాల్‌లో కావ్య అందరికీ టీ ఇస్తుంది. ఆసుపత్రి నుంచి కల్యాణ్ కాల్ చేశాడా? బావ గురించి ఏమైనా చెప్పాడా? అంటుంది ఇందిరా దేవి. ఇప్పట్లో ఈ లోకంలోకి రాడని డాక్టర్ చెప్పారు కదా అని ఏగతాళి చేస్తుంది రుద్రాణీ. ఓ కుళ్లు కుతాంత్రాలకు కేరాఫ్ అడ్రస్ నువ్వే కదా అంటాడు ప్రకాశం. అప్పుడు కనకం వస్తుంది. లోపటికి రా.. అంటుంది అపర్ణ. ఇంకా ఏందుకు అక్కడే నిలబడ్డవ్.. హారతి ఇచ్చి ఆహ్వానం పలకాలా? అంటుంది రుద్రాణీ. అవును.. మామగారు పుణ్యమా అని ఇంట్లోకి ఎంట్రీలేని కావ్యకు మామగారు ఆస్తి రాసిచ్చారు కదా అని ఎగతాళి చేస్తుంది ధాన్యలక్ష్మి.
కనకం అమ్మమ్మగారిని పరామర్శిస్తుంది. ఇలా అవుతుందని ఊహించలేదు. విషయం తెలిసినప్పటి నుంచి మీ గురించే ఆలోచన అంటుంది. అవును పాపం, నిద్ర కూడా కరువై పోయింది అంటుంది రుద్రాణీ. నీలా ఫెషియల్ చేసుకని తిరగాలా? అంటుంది స్వప్న.. ధాన్యలక్ష్మి, రుద్రాణీలను ఉద్దేశించి ఆస్తిలో వాటా కోసం గుంటనక్కలా ఎదురు చూస్తుంది మీ ఇద్దరే కదా అంటాటు ప్రకాశం. పలకరించడానికి వచ్చావో ఆస్తి రాయించుకోవడానికి వచ్చావో ఎవరికి తెలుసు అంటుంది రుద్రాణీ.
మా నాన్న దగ్గర ఆస్తి భలే కొట్టేశారు. ఇన్నాళ్లు మేము ఎదురుచూస్తున్నాం అంటుంది కనకం. మీ తాతయ్య కోమాలో ఉన్నారు కాబట్టి ఆయన ఫ్రెండ్‌కు షూరిటీగా ఉన్నారు 100 కోట్టు కడతారా? ఆస్తి జప్తు చేయమంటారా అనే ఎపిసోడ్ రేపు చూయించనున్నారు.