Delhi Liquor Policy Scam: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఫోటోలు ఇవే.. పిడికిలి బిగించి.. దండం పెడుతూ..!

Fri, 15 Mar 2024-8:48 pm,

ఈడీ అరెస్ట్ అనంతరం ఎమ్మెల్యే కవిత అభివాదం చేస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు మొబైల్‌ ఫోన్స్‌, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  

ఇంట్లోంచి బయటకు వచ్చే క్రమంలో కవిత పిడికిలి బిగించి అభివాదం చేశారు. కార్యకర్తలకు నమస్కారం చేస్తూ ముందుకు వచ్చారు.  

కవిత వెంట కేటీఆర్, హరీశ్ రావు, కేశవరావు తదిరులు ఉన్నారు. కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.  

తన అరెస్ట్‌పై రేపు సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.  

కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link