BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2,399 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీతోపాటు మరిన్ని మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్..
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఏడాది ప్లాన్ అతి తక్కువ ధరలు అందిస్తోంది. జియో, ఎయిర్టెల్ అయితే రూ. 4000 దగ్గరలో ఉన్నాయి. అయితే కేవలం రూ.2500 తో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్లో ఇతర ఫీచర్లు కూడా పొందవచ్చు.
లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ కావాలనే కస్టమర్లు ఈ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవచ్చు. రూ.2399 తో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ ప్యాక్ తో 395 రోజులు వాలిడిటీ వస్తుంది. దీంతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు.
ఈ ఏడాది ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా పొందుతారు. ప్రతిరోజు 2 జీబీ డేటా అందుతుంది. డేటా లిమిట్ అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్ నెట్ వస్తుంది. ఇది కాకుండా ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందుతారు.
ఈ ప్యాక్ ఇతర బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్స్ మ్యూజిక్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్, గేమాన్, పాడ్‌క్యాస్ట్ కూడా 395 రోజుల పాటు పొందుతారు.
ఒకవేళ మీకు డేటా ఎక్కువగా కావాలంటే రూ.2999 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో ప్రతిరోజు 3gb డేటా పొందుతారు. ఉచిత కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు 365 రోజుల వ్యాలిడిటీ అందుకుంటారు.