BSNL: ఫ్రీ..ఫ్రీ.. బీఎస్‌ఎన్‌ల్‌ 4జీ స్పీడ్‌తో 24 జీబీ డేటా పూర్తిగా ఉచితం.. ఈ ఆఫర్‌ ఎలా పొందాలంటే..?

Fri, 04 Oct 2024-12:56 pm,

BSNL 24th Anniversary Offer: పెరిగిన టెలికాం కంపెనీల ధరలు జూన్‌ నుంచి అమలు అయ్యాయి. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ ఆపరేటర్లు రీఛార్జీ ప్లాన్‌ ధరలను పెంచేశాయి. ఇవి రెండూ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ రెండిటికీ వర్తించింది. దాదాపు 15 శాతం రీఛార్జీధరలను పెంచాయి.   

ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు చాలామంది పోర్ట్‌ అయ్యారు. ఈ ప్లాన్‌లో అదనంగా ఫ్రీ డేటా పొందుతారు. ఈ సరికొత్త ఆఫర్లో 24 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది.  ఆ వివరాలు తెలుసుకుందాం.బీఎస్‌ఎన్ఎల్‌ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్‌లో 4 జీ స్పీడ్‌తో 24జీబీ డేటా పొందుతారు.  

ఈ ఆఫర్ పొందాలంటే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఈ ఆఫర్‌ పొందాలంటే రూ.500 కంటే ఎక్కువ రీఛార్జీ వోచర్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్ కేవలం అక్టోబర్‌ 1 నుంచి 24 మధ్య వర్తిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 24 ఏళ్ల నమ్మకం సేవలు సందర్భంగా రూ. 500 కంటే ఎక్కువ రీఛార్జీతో అదనంగా 24 జీబీ డేటా అదనంగా పొందుతారు. భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిలెట్‌ (BSNL) 2000 అక్టోబర్‌ 1 న ప్రారంభించారు.   

బీఎస్‌ఎన్‌ఎల్‌కు చాలామంది పోర్ట్‌ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 4 జీ సేవలను ముమ్మరంగా ప్రారంభించడానికి విస్త్రత స్థాయిలో పనిచేస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది 5 జీ సేవలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link