BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ 365 రోజుల వ్యాలిడిటీ.. ఇంటర్నెట్ డేటా కేవలం రూ.321 మాత్రమే పూర్తివివరాలు ఇవే...
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ కస్టమర్లకు ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందిస్తూ తనదైన ముద్రను వేసుకుంది. బిఎస్ఎన్ఎల్ ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీని ఇస్తుంది. అతి తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు కూడా ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ పొందాలనుకుంటే ఈ ప్లాన్ వివరాలు తెలుసుకోండి...
బిఎస్ఎన్ఎల్ రూ. 321 మాత్రమే 365 రోజుల వాలిడిటీతో రీఛార్జ్ ప్లానింగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఏ జియో ,ఎయిర్టెల్, విఐ కంపెనీలు ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ బిఎస్ఎన్ఎల్ 321 ప్లాన్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ 321 రీఛార్జ్ ప్లాన్ ఏడాదిపాటి వాలిడిటీ వస్తుంది. కానీ ఈ ప్లాన్ కేవలం తమిళనాడులో ఉన్న పోలీస్ ఆఫీసర్లకు అందుబాటులో ఉంది. ఇందులో అన్లిమిటెడ్ సియుజి కాల్స్ పొందుతారు. కేవలం చెన్నై, తమిళనాడు ప్రాంతంలో ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు.
ఈ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్ లో అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ కేవలం ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకు మాత్రమే కాలింగ్ చేస్తున్న సౌకర్యం కలదు. అయితే నాన్ పోలీస్ ఆఫీసర్లకు కూడా కాల్ చేసుకోవచ్చు ,కానీ దానికి తగిన చార్జీలు వసూలు చేస్తారు .
బిఎస్ఎన్ఎల్ లోకల్ కాల్స్ కి 7 పైసా నిమిషానికి ఛార్జ్ చేస్తారు. ఎస్టిడి కాల్స్ విషయానికొస్తే 15 పైసలు కొన్ని నిమిషానికి వసూలు చేస్తారు. దీంతోపాటు 250 ఎస్ఎంఎస్ ఉచితం నెలకు 15 జిబి ఉచితం. వ్యాలిడిటీ ఏడాది పాటు ఉంటుంది. ఈ రీఛార్జి ప్లాన్ మీరు పొందాలనుకుంటే వెబ్సైట్లో నుంచి సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు...