BSNL: ఎక్కువ మంది ఎగబడి మరీ రీఛార్జీ చేసుకుంటున్న ప్లాన్‌ ఇదే.. దీని బంపర్‌ బెనిఫిట్స్‌ ఏంటో తెలుసా?

Tue, 08 Oct 2024-7:02 am,

బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. వారికి బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉండే రీఛార్జీ ప్లాన్లకు కూడా ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంది. అయితే ఎక్కువ శాతం మంది బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు పోటీ పడి మరీ రీఛార్జీ చేసుకుంటున్న ప్లాన్‌ ఏడాది వ్యాలిడిటీ అందిస్తున్న ప్లాన్‌. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.  

మీకు ఏడాది వ్యాలిడిటీ వచ్చే తక్కువ ధరలోని రీఛార్జీ ప్లాన్‌ కావాలంటే ఇదే బెస్ట్‌ ప్లాన్‌. బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో బంపర్‌ బెనిఫిట్లను అందిస్తుంది. ఈ రీఛార్జీ ప్లాన్‌లో మీరు అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ఏడాదిపాటు పొందుతారు. ఈ ప్లాన్‌ వివరాలు తెలుసుకుందాం.  

ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ఏడాది ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 3 జీబీ డేటా పొందుతారు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు ఏడాదిపాటు పొందుతారు. ఇందులో మీకు హైస్పీడ్‌ నెట్‌ కూడా లభిస్తుంది. లిమిట్‌ అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్‌ నెట్‌ అందుతుంది. ప్రతిరోజూ డేటా ఎక్కువ వినియోగించేవారికి ఇది సూపర్‌ ప్లాన్‌. ఈ ప్లాన్‌ ధర రూ.2,999.  

అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1999 ప్లాన్‌ కూడా బెస్ట్‌ బెనిఫిట్స్‌ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు 600 జీబీ డేటా పొందుతారు. అపరిమిత వాయిస్‌ కాలింగ్, నెట్‌ లిమిట్‌ అయిపోయిన తర్వాత 40 కేబీపీఎస్‌ నెట్ స్పీడ్‌ పొందుతారు. అంతేకాదు ఈ ప్లాన్‌లో మీరు హార్డీ గేమ్స్‌, ఛాలెంజర్‌ అరేనా గేమ్స్‌, జింగ్‌ మ్యూజిక్‌, బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్‌ కూడా పొందుతారు.  

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1198 ప్లాన్‌లో ప్రతిరోజూ 3 జీబీ డేటా పొందుతారు. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్‌లో 300 నిమిషాల నెట్‌ వాయిస కాలింగ్‌ పొందుతారు. ప్రతినెల 30 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. డేటా లిమిట్‌ అయిపోయిన తర్వాత ఒక్క ఎంబీకి 25 పైసలు ఛార్జీ చేస్తారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌ కార్డు యాక్టీవ్‌గా ఉండాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link