BSNL Sim Card: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. నచ్చిన ఫ్యాన్సీ నంబర్ తో సిమ్ కార్డు.. ఇలా సెలక్ట్ చేసుకొండి..
కొన్నిరోజులుగా బీఎస్ఎన్ఎల్ కు కస్టమర్లు పొట్టేత్తారు. ఇప్పటికే జియో,ఎయిర్ టెల్ లు రీచార్జీ ధరలను భారీగా పెంచేయడంతో.. బీఎస్ఎన్ఎల్ వైపుకు ఎక్కువ మంది పొర్ట్ అవుతున్నారు. ప్రతిరోజు పొర్ట్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతు వస్తుంది.
ఇదిలా ఉండగా..ఈ క్రమంలో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొని వస్తున్న 4 జీ సేవలు అన్నిచోట్ల అమలయ్యేలా సంస్థ స్పీడును పెంచింది.ఈ నేపథ్యంలో. బీఎస్ఎన్ఎల్ ఇక మీదట మనకు నచ్చిన నెంబర్ ను మనం ఫోన్ నంబర్ గా ఎంచుకొవచ్చు. దీంతో కస్టమర్లు ఎక్కువ మంది సిమ్ కార్డులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ముందుగా కస్టమర్లు.. సెర్చ్ ఇంజిన్ లో.. బీఎస్ఎన్ఎల్ చూస్ యూవర్ మొబైల్ నంబర్ అని సెర్చ్ చేయాలి. ఆతర్వాత వెబ్ పేజ్ లో.. సీవైఎమ్ఎన్ పై క్లిక్ చేయాలి.
మీ జోన్ , స్టేట్ ను ఎంచుకొవాలి.నచ్చిన ఫోన్ నంబర్ కోసం వెతికేందుకు ఆప్షన్ వస్తుంది. అందులో.. సెర్చ్ విత్ సిరిస్, స్టార్ట్ నంబర్, ఎండ్ నంబర్, సమ్ నంబర్ అని నాలుగు ఆప్షన్లు ఉంటాయి.
ఒకవేళ ఫ్యాన్సీ నంబర్ కావాలిస్తే.. పక్కనే మరో ఆప్షన్ ఉంటుంది. వీటిని ఎంచుకుని సెర్చ్ చేయాలి. మనం ఎంటర్ చేసిన డాటా ఆధారంగా కొన్ని నంబర్ లను చూపిస్తుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్ ను దానిలో ఎంటర్ చేయాలి.
అప్పుడు ఫోన్ కు ఓటీపీ వస్తుంది. వెంటనే ఆ నంబర్ రిజర్వ్ అవుతుంది.ఆ తర్వాత దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు వెళ్లి సిమ్ కార్డు తీసుకొవచ్చు.ఈ క్రమంలో ఈ ఫెసిలీటితో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.