BSN Popular Plan: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే చౌకైన ప్లాన్.. రూ. 797 రీఛార్జీతో 300 రోజుల వ్యాలిడిటీ..
ఈరోజు అతి తక్కువ ధరల్లో ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న రీఛార్జీ ప్లాన్ గురించి తెలుసుకుందాం. బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 797 ప్లాన్. ఈ రీఛార్జీ ప్లాన్ ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్యాక్ తో రీఛార్జీ చేసుకుంటే 300 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. వినియోగదారులు ఒక్కసారి రీఛార్జీ చేసుకుంటే ఎక్కువ రోజులపాటు ప్యాక్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయవచ్చు.
రూ. 797 బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జీ ప్యాన్‌తో 300 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. తరచూ రీఛార్జీలు చేసుకునే వినియోగదారులకు ఇది అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఇది వినియోగదారులకు ఏడాదిపాటు నిరంతరాయ లాభాలను గడిస్తుంది.
రూ. 797 ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ జియో, వీఐ, ఎయిర్‌టెల్ అన్ని నెట్వర్లతో ఫ్రీకాల్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్ ఎక్కువ అవసరం ఉన్న వినియోగదారలుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ప్యాక్.
ఈ ప్యాక్ ద్వారా మీరు 600 జీబీ డేటా పొందుతారు. మొదటి 60 రోజులపాటు 2 జీబీ హైస్పీడ్ డేటా ప్రతిరోజూ పొందుతారు. ఇది 300 రోజులకు వర్తిస్తుంది. అంతేకాదు ఆ తర్వాత 60 రోజులపాటు 40 కేబీపీఎస్ నెట్ స్పీడ్ వస్తుంది. ఇందులో పరిమిత డేటా వినియోగం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ మొదటి 60 రోజులపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు ప్రతి రోజు పొందవచ్చ. ఎక్కువ శాతం వాయిస్ కాలింగ్ చేసుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్.