BSNL: జియో ఎయిర్‌టెల్‌కు బిగ్‌షాక్‌ ఇస్తోన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ప్లాన్‌.. రోజుకు రూ.3 కంటే తక్కువ, 300 రోజుల వ్యాలిడిటీ..

Thu, 02 Jan 2025-6:59 am,

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.797 ప్లాన్‌ వ్యాలిడిటీ 300 రోజులు వర్తిస్తుంది. అంటే ప్రతిరోజు రూ.3 కంటే తక్కువ. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 2 జీబీ డేటా డైలీ, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు ప్రతి రోజూ పొందుతారు. 60 రోజులు పూర్తయిన తర్వాత ఉచితంగా ఇన్‌కమింగ్‌ కాల్స్ పొందుతారు.  

బీఎస్ఎన్‌ఎల్‌  దేశంలోనే మొదటి  డైరెక్ట్‌ టూ మొబైల్ సర్వీస్‌ బైటీవీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.దీంతో 300 లైవ్ టీవీ చానల్స్‌ మొబైల్‌ ద్వారానే వీక్షించవచ్చు. మొదటగా దీన్ని పుదుచ్చేరిలో ప్రారంభించింది.   

ఇదికాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఐఎఫ్‌టీవీ సర్వీస్‌ కూడా పరిచయం చేసింది. ఈ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు లైవ్‌ టీవీ ఛానల్స్ కూడా యాక్సెస్‌ చేయవచ్చు. ఇవి కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి త్వరలో 4జీ, 5 జీ సేవలను దేశవ్యాప్తంగా అందించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.  

ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల ఇన్‌స్టాలేషన్‌ కూడా పెంచింది. పెరిగిన టెలికాం ధరల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరలోనే బడ్జెట్‌ ఫ్రెండ్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఇది ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తోంది.  

జూలై తర్వాత ఎక్కువ శాతం మంది జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్‌ అయ్యారు. ఎందుకంటే ఈ కంపెనీలు టెలికాం ధరలను 20 శాతం వరకు పెంచేశాయి. బీఎస్‌ఎన్ఎల్‌ ఖాతాలో కస్టమర్లు పెరిగారు. వారిని మరింత ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్స్‌ కూడా పరిచయం చేస్తోంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link