Budhaditya Yoga 2024: బుధాదిత్య రాజ యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి షాక్.. 100 శాతం జరిగేది ఇదే!
బుధుడు గ్రహాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహం. ప్రస్తుతం ఈ గ్రహం సింహ రాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించింది. కానీ ఇప్పటికే సూర్య, కేతువులు ఇందులో ఉండటం వల్ల కన్యారాశిలో బుధాదిత్య యోగం ఏర్పడింది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధాదిత్య యోగం వల్ల రాజ యోగాన్ని పొందుతారు. అంతేకాకుండా బుధుడు తన రాశికిలో రావడం వల్ల ఇది భద్రరాజ యోగంగా ఏర్పడుతుంది. ఈ యోగాల కలయికల వల్ల మొత్తం పన్నెండు రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏ రాశివారికి ధన, భూ లాభాలు కలుగుతాయి..?
మేష రాశి: ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం కొంత తగ్గుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శాంతితో సమస్యలను పరిష్కరించాలి. ఆహారం, నిద్రపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి.ఇష్టదైవంను పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం రాశి: సింహ రాశి వారికి మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కెరీర్‌లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. ప్రశాంతంగా మాట్లాడం వల్ల సమస్యలు తొలుగుతాయి. ఆరోగ్యం పరంగా కొంత జాగ్రత్త వహించాలి.
కన్య రాశి: ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. పెండింగ్ ఉన్న బకాయిలు వెంటనే వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు జరుగుతాయి. నిరశ పడకుండా ముందు అడుగు వేయాల్సి ఉంటుంది.
ధనుస్సు రాశి: వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు అధికంగా పెరుగుతాయి. ఆర్ధికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికి సమయానికి డబ్బులు అందుతాయి. ఇతరులతో మాట్లడే ముందు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
మకర రాశి: మకర రాశివారికి ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంది. అనవరసమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి: ఈ రాశివారు ఉద్యోగంలో పనిని నిజాయితీగా చేయాలి. ఆర్థికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబసభ్యులతో కొంత సమయం గడపాల్సి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి.