Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. క్యాబినెట్ మీటింగ్ భేటీలో కీలక నిర్ణయం..!
రేషన్ కార్డు ప్రతి పథకానికి కీలకం, దీని ద్వారా ప్రతినెలా సరుకులు అందుతాయి. ముఖ్యంగా బిపిఎల్ కుటుంబాలకు రేషన్ కార్డులు ఎంతో ముఖ్యం వారిని ఆర్థికంగా చేయూత ఇస్తుంది. అయితే రేషన్ కార్డు కలిగిన వారికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే నెల నుంచి సన్న బియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు రేషన్ కార్డులో ఉన్న ఒక్కో సభ్యుడికి 6 కేజీల వరకు సన్నబియ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై శనివారం జరుగనున్న క్యాబినెట్ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకోని ఉన్నట్లు తెలుస్తోంది.
సన్న వడ్లను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగా రావని అందుకే రెండు నెలల తర్వాత మిల్లడించి పంపిణీ చేయాలని ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చే వెసులుబాటు కూడా కల్పించింది. దీనికి రేషన్ కార్డుదారి భార్య లేదా భర్త పిల్లల పేర్లు కూడా చేర్చుకోవచ్చు దీనికి ఆధార్ కార్డులు తప్పనిసరి. పెళ్లయిన వారికి వివాహ ధ్రువీకరణ పత్రం కూడా తప్పనిసరి.
అభయ హస్తంలో భాగంగా చాలామంది రేషన్ కార్డు లేనివారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. త్వరలో కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తున్నారు.