Business Ideas: ఈ బిజినెస్ గురించి తెలుసుకొని సిల్లీగా చూడకండి... నెలకు 1 లక్షకు పైగా ఆదాయం అందిస్తుంది
Business Ideas: ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాదు మరి కొంతమందికి ఉపాధి సైతం కల్పించవచ్చు. పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడే పాప్ కార్న్ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే పాప్ కార్న్ అనగానే ఇందులో పెద్ద లాభం ఏముంది అని మీరు చిన్న చూపు చూడవచ్చు.
నిజానికి స్నాక్స్ అన్నింటిలో కూడా అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం లభించే స్నాక్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది పాప్ కార్న్ బిజినెస్ అనే చెప్పాలి. ఈ బిజినెస్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ ను సక్సెస్ఫుల్ ప్లాన్ గా ఎలా అమలు చేయాలో తెలుసుకుందాం. నిజానికి పాప్ కార్న్ అనగానే ప్రతి ఒక్కరికి సినిమా థియేటర్లో కొనుగోలు చేసే పాప్ కార్న్ ఒకటే గుర్తొస్తుంది.
కానీ పిల్లలు పెద్దలు అందరూ తమ ఇంటి వద్ద కూడా వీటిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాకేజ్ స్నాక్స్ లో ఎక్కువగా ఆలుచిప్స్, మిక్సర్, బూందీ వంటివి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అయితే పాప్ కార్న్ సైతం ఇదేవిధంగా ప్యాక్ చేసి మంచి బ్రాండింగ్ తో మార్కెట్లో ప్రవేశపెడితే పెద్ద మొత్తంలో అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం మీరు కమర్షియల్ పాప్కార్న్ మేకింగ్ మిషన్ కొనుగోలు చేయాలి. దీని ధర రూ. 2 లక్షల వరకూ ఉంటుంది. అలాగే ప్యాకింగ్ మిషన్ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మేకింగ్ మిషన్ నుంచి ప్యాకింగ్ వరకు కన్వేయర్ బెల్ట్ ఇలా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి అవుతుంది.
ముందుగా మీరు ఒక రిజిస్టర్ కంపెనీ నమోదు చేయించి ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత చక్కటి బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కటి మార్కెటింగ్ ప్లాన్ ద్వారా అన్ని కిరాణా షాపుల్లో అందుబాటులో ఉంచేలా చేయాలి.
డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మీరు మార్కెట్లో ప్రోడక్ట్ అందుబాటులో ఉంచేలా చేయాలి. పాప్ కార్న్ లో వివిధ రకాల మసాలా ఫ్లేవర్లను ప్రవేశపెడితే మరింత ఎక్కువ సేల్స్ అయ్యే అవకాశం ఉంటుం