Top Small Business Ideas: బిజినెస్‌ ఐడియా.. కేవలం రూ. 10,000 పెట్టుబడితో.. నెలకు రూ. 90 వేలు ఆదాయం గ్యారంటీ..!

Mon, 28 Oct 2024-5:30 pm,

 బ్యాంగిల్స్ అంటే మహిళల అందానికి అద్దం లాంటివి. ఇవి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంలో బ్యాంగిల్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వివిధ రకాల డిజైన్లు, పదార్థాలతో తయారైన బ్యాంగిల్స్ మహిళల చేతుల అందాన్ని మరింత పెంచుతాయి.

బ్యాంగిల్స్‌లో అనేక రకాలు ఉంటాయి.. అందులో గాజు బ్యాంగిల్స్, లోహపు బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, కుందన్ బ్యాంగిల్స్, లాక్ బ్యాంగిల్స్, కడ బ్యాంగిల్స్ ఎంతో ప్రత్యేకమైనవి. ఇవి పండుగ, సాధారణ సమయంలో డిమాండ్‌ ఎక్కువ. 

ఈ దీపావళికి మీరు ఏదైనా కొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలని ఆలోచిస్తున్నారా..?     అయితే బ్యాంగిల్స్‌ బిజినెస్‌ బెస్ట్‌  ఐడియా.. దీని కోసం మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చు. 

ఈ బిజినెస్‌ కోసం కేవలం 10,000తో ప్రారంభించివచ్చు.  బ్యాంగిల్ వ్యాపారంలో లాభాల మార్జిన్ 20 నుంచి 50 శాతం వరకు ఉంటుంది.  ఒక బ్యాంగిల్‌ను కొనుగోలు చేసి దానిపై 20% నుంచి 50% వరకు లాభం చేసి అమ్మవచ్చు.  

ఈ లాభం మార్జిన్ బ్యాంగిల్‌  నాణ్యత, డిజైన్ దానిని కొనుగోలు చేసిన చోటు దానిని అమ్మే చోటు వంటి అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఇతర వ్యాపారాలతో పోలిస్తే బ్యాంగిల్ వ్యాపారంలో లాభం మార్జిన్ చాలా ఎక్కువ.  

బ్యాంగిల్స్ బిజినెస్‌ తో నెలకు రూ. 90, 000 సంపాదించవచ్చు. కేవలం బ్యాంగిల్స్‌కు ఉన్న డిమాండ్, ధరలు, ట్రెండ్స్ గురించి లోతైన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. కొత్త డిజైన్లు అమ్మడం వల్ల సులభం ఈ బిజినెస్‌ ఆదాయం పెరుగుతునే ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link