Business Ideas For Women: మహిళలు.. రూపాయి పెట్టుబడి లేకుండా బిందాస్‌గా డబ్బులు సంపాదించే బిజినెస్ ఐడియా మీ కోసం
Business Ideas For Women: మహిళలు వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మీరు ప్రతి నెల నెలకు 50000 తగ్గకుండా సంపాదించుకునే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు సీజన్తో సంబంధం లేకుండా ప్రతి నెల డబ్బు సంపాదించుకోవచ్చు.
ఈ బిజినెస్ చేయడం కోసం మీరు ప్రతిరోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కష్టపడితే సరిపోతుంది. దీంతోపాటు ఇల్లు కదలకుండానే మీరు ఈ బిజినెస్ లో రాణించవచ్చు. ఆ బిజినెస్ ప్లాన్ ఏదో చూద్దాం.
ఈ మధ్యకాలంలో ప్రతి సందర్భానికి కేక్ ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. బర్త్డే, యానివర్సరీ ఇలా సందర్భం ఏదైనా కేక్ ఉంటేనే మజా వస్తుందని. ప్రతి ఒక్కరు కేక్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే దీన్ని మీరు ఒక వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు . దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
మహిళలు ఇంటి వద్ద ఉండి కొద్దిగా కష్టపడటం వల్ల కేక్ బిజినెస్‌లో చక్కగా రాణించవచ్చు. ఈ కేక్ బిజినెస్ కోసం మీరు ఒక కోర్సు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా కేక్ తయారీ కోసం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం మీరు హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు అదేవిధంగా కొన్ని హోమ్ సైన్స్ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ఈ కోర్సుల్లో చేరడం వల్ల మీరు కేక్ తయారీ విధానం నేర్చుకోవచ్చు. కేక్ తయారీలో నైపుణ్యం సాధించిన తర్వాత మీరు సొంతంగా బిజినెస్ ప్రారంభించవచ్చు.
ఇక కేక్ మంచి డిజైన్ ఉన్న కేక్ ధర కనీసం 500 రూపాయలు ఉంటుంది. ఇలా రోజుకు కనీసం నాలుగు కేకు ఆర్డర్లు పొందిన మీకు రోజుకు 4000 రూపాయల ఆదాయం లభిస్తుంది. ఈ లెక్కన ఖర్చులు పోను నెలకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం లభిస్తుంది.
ఇక మీరు ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మీ కేక్ బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే.. ముందుగా ఒక ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే fssai నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. దీంతోపాటు జీఎస్టీ నెంబర్ పొందాల్సి ఉంటుంది. అనంతరం ఫుడ్ డెలివరీ యాప్స్ ని సంప్రదించి మీరు నమోదు చేసుకున్నట్లయితే.. ఆర్డర్లు పొందే అవకాశం లభిస్తుంది. మీ బిజినెస్ పెరిగే కొద్దీ కొంతమంది సహాయకులను కూడా పెట్టుకున్నట్లయితే పెద్ద మొత్తంలో ఆర్డర్లను పొందవచ్చు.