Business Ideas: ఈ పండ్లను పండిస్తే బంగారాన్ని పండించినట్లే.. కిలో రూ. 1000కి అమ్ముతారు.. ఎకరం భూమిలో సాగు చేస్తే ఏడాదికి 60 లక్షలు పక్కా

Wed, 27 Nov 2024-5:52 pm,

 Business Ideas: చాలా మంది ఉద్యోగాలు మానేసి ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువత అయితే ఉద్యోగం కంటే ఏదైనా వ్యాపారం చేసుకుంటే మేలు అని ఆలోచిస్తున్నారు. అయితే ఉన్న ఊరిలోనే మీరు లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. అవును ఈ వ్యాపారం ప్రారంభిస్తే ఏడాదికి 60లక్షలు మీ అకౌంట్లో చేరుతాయి. ఆ బిజినెస్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.   

ఇప్పుడు దేశంలో విద్యావంతులైన యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ యువత రాకతో వ్యవసాయ పద్ధతుల్లో మార్పు వచ్చింది. నేటికాలం యువత సంప్రదాయ పద్ధతిలోనే కాదు..ఆధునిక, శాస్త్రీయ పద్దతుల్లోనూ వ్యవసాయం చేస్తున్నారు.  దీని వల్ల ఉత్పత్తి పెరగడమే కాకుండా ప్రజల ఆదాయం కూడా పెరిగింది. 

విశేషమేమిటంటే.. ప్రస్తుతం యువత వరి, గోధుమల సాగుకు బదులు తోటల పెంపకంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు యువ రైతులు మామిడి, లిచ్చి, పుట్టగొడుగులు, లేడీస్ గోర్డ్, డ్రాగన్ ఫ్రూట్,  స్ట్రాబెర్రీలతో సహా అనేక విదేశీ పండ్లు,  కూరగాయలను కూడా పండిస్తున్నారు. వ్యవసాయం ఇప్పుడు వ్యాపారంగా మారడానికి ఇదే కారణం.   

మీరు బ్లూబెర్రీ తోట సాగు  ప్రారంభిస్తే, మీ ఆదాయం అనేక రెట్లు పెరుగుతుంది. అయితే, దేశంలోని అనేక ప్రాంతాల్లో, రైతులు కూడా అమెరికన్ బ్లూబెర్రీస్ సాగు చేయడం ప్రారంభించారు. దీంతో వారికి మంచి లాభాలు వస్తున్నాయి. ఎందుకంటే బ్లూబెర్రీ చాలా ఖరీదైన పండు. కిలో రూ.1,000కు విక్రయిస్తున్నారు. అమెరికన్ బ్లూబెర్రీస్ సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందిన పండు. అయితే, భారతదేశంలో దీని ఉత్పత్తి చాలా తక్కువ. అమెరికా నుంచి ఇండియాకు బ్లూబెర్రీస్ దిగుమతి కావడానికి ఇదే కారణం.  

ఇది భారతదేశంలో అమెరికన్ బ్లూబెర్రీ  ప్రత్యేకమైన సాగు. దీనిని సాగు చేస్తూ రైతులు లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. బ్లూబెర్రీ ప్రత్యేకత గురించి చెప్పాలంటే.. దీన్ని ప్రతి సంవత్సరం సాగు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి నాటితే, మీరు 10 సంవత్సరాల పాటు బ్లూబెర్రీస్ ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా, బ్లూబెర్రీస్‌లో అనేక విటమిన్లు,  పోషకాలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. భారతదేశంలో అనేక రకాల బ్లూబెర్రీస్ ఉన్నాయి.  

బ్లూబెర్రీ మొక్కలు ఏప్రిల్,మే నెలలలో నాటుతారు. 10 నెలల తర్వాత, మొక్కలు ఫలాలను ఇస్తాయి. అంటే మీరు ఫిబ్రవరి-మార్చి నుండి పండ్లను కోస్తారు.  ఇది జూన్ నెల వరకు కొనసాగుతుంది. అదే సమయంలో, రుతుపవనాలు వచ్చిన తర్వాత, బ్లూబెర్రీ మొక్కలను కత్తిరించడం జరుగుతుంది. రెండు మూడు నెలల కత్తిరింపు తర్వాత, సెప్టెంబర్-అక్టోబర్ నాటికి, కొమ్మలు పెరగడం ప్రారంభిస్తాయి. పువ్వులు కూడా కనిపిస్తాయి.   

బ్లూబెర్రీ మొక్కను ప్రతి సంవత్సరం కత్తిరించడం వల్ల దాని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మీరు ఒక ఎకరంలో 3000 బ్లూబెర్రీ మొక్కలను నాటవచ్చు. ఒక మొక్క నుంచి 2 కిలోల వరకు బ్లూబెర్రీ పండ్లు కాస్తాయి. అయితే మీరు బ్లూబెర్రీలను కిలో రూ. 1000 చొప్పున మార్కెట్‌లో విక్రయించవచ్చు. ఈ విధంగా ఏడాదికి 6000 కిలోల బ్లూబెర్రీస్‌ను విక్రయించడం ద్వారా రూ.60 లక్షల వరకు సంపాదించవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link