Business Ideas In India: ఈ ఐడియా మీ జీవితాన్నే మార్చుతుంది.. రూ.400 పెట్టుబడి పెడితే, రోజుకు రూ.5 వేలు సంపాదించవచ్చు!
మన దేశానికి బ్రిటిష్ వారు కాఫీ పరిచయం చేసిన తర్వాత పల్లె ప్రాంతాల్లో టీ తాగడం అలవాటైపోయింది దీనికి కారణంగా భారతదేశ వ్యాప్తంగా టీ తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పటికి ఈ సంఖ్య రెట్టింపు అయింది. అంతే కాదండోయ్ చాలామంది రోజును టీతోనే ప్రారంభిస్తున్నారు.
ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ కారణంగా టీ ని ఇంట్లో తయారు చేసుకొని తాగడం కంటే ఎక్కువగా బయట టీ స్టాల్ లలో తాగుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది టీ టైం, చాయ్ వాలా లాంటి టీ స్టాల్స్ ని ఓపెన్ చేశారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ లభించింది. అద్భుతమైన టేస్ట్ తో టీ స్టాల్స్ ని ప్రారంభించడం వల్ల నెలల్లో లక్షలు సంపాదించవచ్చని తెలిసి వచ్చింది.
ప్రస్తుతం చాలావరకు జనాలు ఎక్కువ ఉన్నచోట్ల కార్మిక ప్రదేశాలను రోడ్డు పక్కనే టీ స్టాల్స్ ని ఏర్పాటు చేసి ఏం లేకున్నా రోజుకే రూ. 5వేల వరకు సంపాదించవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా తేలిక దీనికి కావలసింది అన్న ఒక స్టాల్, టీ తయారీ చేయడానికి కావలసిన పదార్థాలు పాత్రలు.. ఇవన్నీ ఉంటే చాలు సులభంగా మీ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నచోట లేదా పార్కు, కార్మిక ప్రదేశాల్లో తక్కువ రేట్లలో టీలను విక్రయించడం వల్ల బిజినెస్ విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ స్టాల్స్ లో నే టిఫిన్స్ కూడా ప్రారంభించవచ్చు. ఇలా చేయడం వల్ల ఖర్చులు కూడా కలిసి వచ్చి రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు.
ఈ టీ స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్కెట్లో లభించే అతి తక్కువ ధరల్లో ఉన్న టీ స్టాల్ ని కొనుక్కొని, మీరు అనుకున్న ప్రదేశంలో ఈ స్టాల్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక టీ ని తయారు చేయడానికి కావలసిన అన్ని పాత్రలు కొనుక్కొని టీ స్టాల్ లో పెట్టుకోవాలి.
ముఖ్యంగా ఈ స్టాల్ లో టీని తయారు చేయడమే కాకుండా కాఫీ ఇతర పానీయాలను కూడా విక్రయించవచ్చు. ఇది ఇలా ఉండగా టీ ని కొన్ని రోజులపాటు మంచి సువాసనతో కూడిన టీ పౌడర్ తో తయారు చేసి విక్రయించడం వల్ల కస్టమర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా రోజు టీతోపాటు టిఫిన్స్ విక్రయించడం వల్ల దాదాపు అన్ని ఖర్చులు పోను రూ.5,000 పాటు సంపాదించవచ్చు.