BYD eMAX7: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లొచ్చు..కిక్కెక్కించే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ కారు
Electric Car: భారత మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ ఇచ్చింది. కిక్కెక్కించే ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి ప్రవేశించింది.చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న బీవైడీ అనుబంధ సంస్థ అయిన బీవైడీ ఇండియా తాజాగా BYD 6, 7 సీట్ల వెర్షన్‌లతో కొత్త ఎలక్ట్రిక్ కారు eMAX 7ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. eMAX 7 కేవలం 10.1 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
BYD eMAX 7 Price in India: బీవైడీ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌ను మరింత ప్రొడక్ట్ విటినీ పెంచుకుంటూ eMAX 7ని విడుదల చేసింది. ఇది కొత్త ఎలక్ట్రిక్ MPV కారు, ఇది తప్పనిసరిగా e6 అప్‌గ్రేడ్. BYD సరికొత్త ఎలక్ట్రిక్ కారును ప్రీమియం, సుపీరియర్ అనే రెండు వేరియంట్‌లలో పరిచయం చేసింది. మీకు పెద్ద కుటుంబం ఉంటే, ఈ ఎలక్ట్రిక్ కారు మంచి ఎంపిక. ఇందులో 6, 7 సీట్ల ఎంపికలు అందుబాటులో ఉంటాయి. eMAX 7 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 26.9 లక్షలు. దాని సింగిల్ ఛార్జ్ పరిధి 530 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
భారతదేశంలో చాలా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి, కానీ eMAX 7 ఎక్కువ సీట్లతో వస్తుంది. పెద్ద కుటుంబం, ఎక్కువ ప్రయాణీకుల సామర్థ్యంతో, 5 కంటే ఎక్కువ సీట్లతో ఎలక్ట్రిక్ కారును కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది.
BYD eMAX 7: ఫీచర్లు eMax7 అనేది మూడు-వరుసల ఎలక్ట్రిక్ MPV, ఇది 6 లేదా 7 సీట్ల ఆప్షన్స్ తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 12.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కాకుండా, ఇందులో రెండు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, వెంటిలేటెడ్ ఫీచర్‌లతో కూడిన లెథెరెట్ సీట్లు, కొత్త డ్రైవ్ నాబ్, ఎలక్ట్రికల్ పవర్డ్ టెయిల్‌గేట్ 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. మంచి గాలి కోసం కార్ బ్యాక్ సీట్లపై రూఫ్ -మౌంటెడ్ వెంట్స్ కూడా ఉన్నాయి.
BYD eMAX 7: బ్యాటరీ: eMAX7 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది - 55.4 kWh, 71.8 kWh. 71.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో డ్యూయల్ మోటార్ సెటప్ ఉంది. 55.4 kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్ కొంచెం చౌకగా ఉంటుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 420 కి.మీ.
BYD eMAX 7: ధర BYD eMax 7 ఎలక్ట్రిక్ కారు 8.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ కారుకు భారతదేశంలోని ఏ ఇతర ఎలక్ట్రిక్ కారుతోనూ ప్రత్యక్ష పోటీ లేదు . దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 26.9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన వెర్షన్ ఈమ్యాక్స్ 7 ఎక్స్-షోరూమ్ ధర రూ.29.9 లక్షలు.