5 Cancer Causes: కొవ్వొత్తి నుంచి పెయింట్ వరకూ అన్నీ కేన్సర్ కారకాలే, ఈ 5 వస్తువులతో జాగ్రత్త
మ్యాట్రెస్
ఎన్విరాన్‌మెంటల్ వర్కింగ్ గ్రూప్ ప్రకారం చాలా పరుపుల్లో పోలీయూరేథెన్ ఫోమ్ కారణంగా హాని కారకమైన ఓలేటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వెలువడుతాయి. వీటి వల్ల దీర్ఘకాలంలో శ్వాస సంబంధం సమస్యలతో పాటు కేన్సర్ ముప్పు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి. అందుకే మ్యాట్రెస్ కొనుగోలు చేసేముందు కెమికల్ వినియోగించేవి తగ్గించాలి.
సెంటెడ్ క్యాండిల్
సెంటెడ్ క్యాండిల్ వెలిగించడం వల్ల గాలిలో పార్టిక్యులెట్ మ్యాటర్, వోలేటైన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వెలువడుతాయి. ఇవి సాధారణంగా కేన్సర్ ముప్పును పెంచేవి. కొంతమందికి సెంటెడ్ కాండిల్స్ ఎలర్జీ కల్గిస్తాయి. లేదా తలనొప్పి తెస్తాయి. అందుకే నేచురల్ క్యాండిల్స్ బెస్ట్ ఆప్షన్
పెయింట్స్
పెయింట్స్‌లో ఉండజే కెమికల్స్ ఆరోగ్యానికి పూర్తిగా హానికారకం. బెంజీన్, టాల్యూయిన్, ఇథైల్ బెంజీన్ వంటి కార్సినోజెన్ అంటే కేస్సర్ కారకాలు ఉంటాయి. ఇవి చర్మంలో ఎలర్జీ లేద మంటకు కారణమౌతాయి. కేన్సర్ ముప్పును పెంచుతాయి.
ప్లాస్టిక్ కంటెయినర్స్ అండ్ బాటిల్స్
ప్లాస్టిక్ డబ్బాల్లో తినే ఆహార పదార్ధాలు ఉంచడం లేదా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగడం చేస్తుంటే వెంటనే మానేయండి. వీటి వల్ల మైక్రోప్లాస్టిక్ లేదా హానికారక రసాయనాలు మీ శరీరంలో చేరవచ్చు. అందుకే వీటిని వినియోగించడం మంచిది కాదు.
నాన్‌స్టిక్ కుక్ వేర్
టెఫ్లాన్ లేదా నాన్‌స్టిక్ కుక్ వేర్ సామగ్రిలో వంటలు చాలా కామన్‌గా మారిపోయింది. కానీ వీటిని ఎక్కువగా వేడి చేయడం వల్ల అందులోంచి విష పూరిత పదార్ధాలు బయటకు వస్తాయి. ఇవి కేన్సర్ ముప్పును పెంచుతాయి. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం నాన్‌స్టిక్ కుక్ వేర్ సామగ్రి మంచిది కాదు.