Karnataka Cake: ఈ కేకులు రుచికరమే కాదండోయ్ హానికరం కూడా.. క్యాన్సర్ కారకాలు గుర్తింపు..!

Fri, 04 Oct 2024-7:56 pm,

కేక్ తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో ఆరోగ్యానికి అంత కహానికరం అని తాజాగా కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది.. తాజాగా బెంగళూరులో 12 రకాల కేకులలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలోని బేకరీలలో తయారు చేసే కేకులలో క్యాన్సర్ కి కారణమయ్యే పదార్థాలను ఉపయోగించడం పై .. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.   

ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం గోబీ మంచూరియా, కబాబ్స్, పానీ పూరీ వంటి ఫేమస్ వంటకాలలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని హెచ్చరించిన ఈ శాఖ ఇప్పుడు మళ్లీ కేకుల్లో కూడా ఇలాంటివి ఉన్నట్టు చెప్పుకొచ్చింది. పలు బేకరీలలోని కేకులపై పరీక్షలు నిర్వహించగా.. 12 రకాల కేకుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని గుర్తించింది. ముఖ్యంగా ఈ కేకులు తినడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ముప్పు ఏర్పడుతుందని కూడా హెచ్చరించింది. 

ముఖ్యంగా ఈ కేకులలో కలుపుతున్న కృత్రిమ రంగులే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని,  వీటివల్లే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆ శాఖ వెల్లడించింది. మొత్తానికైతే కేక్ అంటే ఇష్టపడే వారికి ఈ విషయం కాస్త ఆశ్చర్యపరచవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్లాక్ ఫారెస్ట్,  రెడ్ వెల్వెట్ వంటి ప్రసిద్ధ రకాలు చూసేందుకు ఆకర్షణంగా కనిపించడానికి కృత్రిమ రంగులు ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదమని అధికారులు చెబుతున్నారు.

ఇకపోతే కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన ప్రకారం పరీక్షించిన 235 కేకు నమూనాలలో.. ఏకంగా 12 అల్లూరా రెడ్ , సన్ సెట్ ఎల్లో FCF, Ponceau 4R, Tartrazine అలాగే Carmoisine వంటి కృత్రిమ రంగులు కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలని దయచేసి ఇలాంటి కేకులు ఎవరు తినకండి అంటూ కూడా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 

మొత్తానికి కేకులను ఇష్టంగా తినే పిల్లలకు పెద్దలకు ఇది అతిపెద్ద షాక్ కలిగించిందని చెప్పవచ్చు. ఇకపోతే కేకులను తనిఖీ చేయడంతో పాటు ఇతర ఆహార పదార్థాలను కూడా ఆ శాఖ ఇటీవల పరీక్షించింది.  ఇందులో 221 పన్నీర్ నమూనాలు అలాగే 65 ఖోయా నమూనాలను పరిశీలించగా అందులో ఒకటి మాత్రమే నాసిరకమని కనుగొన్నారు. అలాగే సెప్టెంబర్ లో రైల్వే ఫుడ్ స్టాల్స్ టూరిస్ట్  స్పాట్లలో నిర్వహించిన తనిఖీలలో కూడా ఆహార భద్రత నియమాలు పాటించని ఎన్నో కేసులు బయటపడ్డాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link