7 Pre Cancer Signs: జీరో స్టేజ్ కేన్సర్ అంటే ఏంటి, ప్రీ కేన్సర్ 7 లక్షణాలు ఎలా ఉంటాయి
ఇతర లక్షణాలు
కొంతమందికి శరీరంలో ఒకేసారి ఏదైనా మొటిమలాంటిది మొదలై పెరుగుతూ కన్పించవచ్చు. ఈ పరిస్థితి ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదించాలి.
శరీరంపై ఏదైనా పుండు ఏర్పడటం
శరీరంపై ఏదైనా భాగంలో అకస్మాత్తుగా పుండు ఏర్పడితే కచ్చితంగా అది కేన్సర్ లక్షణం కావచ్చని గుర్తుంచుకోండి. ఈ సమస్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు
బరువు తగ్గిపోవడం
మీరు తీసుకునే డైట్ బాగానే ఉన్నా ఒక్కోసారి బరువు వేగంగా తగ్గిపోతుంటారు. ఇది కేన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు
మలబద్ధకం
కొంతమందికి తరచూ మలబద్ధకం సమస్య తలెత్తుతుంటుంది. కడుపు లేదా ప్రేవుల్లో కేన్సర్ ప్రారంభదశలో ఉందని అర్ధం.
విరేచనాలు
మీకు తరచూ విరేచనాల సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఇది కూడా కేన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. కడుపు లేదా ప్రేవుల్లో ఏదైనా గంభీరమైన సమస్య కావచ్చు
నాలుకపై తెల్లటి మచ్చలు
నాలుకపై లేదా నోట్లో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు కన్పిస్తే కేన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఇవి సమయం గడిచే కొద్దీ పెరుగుతుంటాయి.
తరచూ నోటి పూత
మీకు నోటి పూత తరచూ వస్తుంటే దీర్ఘకాలం తగ్గకుండా ఉంటే అది ప్రీ కేన్సర్ స్థితి కావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.