NTR Bharosa Pension: ముఖ్యమంత్రిగా చంద్రబాబు సరికొత్త రికార్డు.. 95 శాతం సక్సెస్

Mon, 01 Jul 2024-9:37 pm,

NTR Bharosa Pension: ఏపీ ప్రభుత్వం రూ.వెయ్యి పెంచి రూ.4 వేల పింఛన్‌ను జూలై 1వ తేదీ నుంచి అందిస్తోంది.

NTR Bharosa Pension: పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి లబ్ధిదారులకు పింఛన్‌ అందించారు.

NTR Bharosa Pension: రాష్ట్రవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పింఛన్‌ల పంపిణీ చేపట్టారు.  

NTR Bharosa Pension: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది పింఛన్‌దారులకు రూ.4,408 కోట్లు పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

NTR Bharosa Pension: తొలిరోజే 100 శాతం పంపిణీకి ఏర్పాట్లు చేయగా.. రికార్డు స్థాయిలో దాదాపుగా 95 శాతం పూర్తి చేశారు.

NTR Bharosa Pension: ప్రభుత్వ యంత్రాంగంతో 12 గంటల వ్యవధిలో పింఛన్ల పంపిణీని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.

NTR Bharosa Pension: పింఛన్ల పంపిణీని విజయవంతం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికీ సీఎం చంద్రబాబు అభినందించారు.  

NTR Bharosa Pension: పింఛన్ల పంపిణీ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు.  

NTR Bharosa Pension: పింఛన్ల పంపిణీలో కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. టీడీపీ నాయకులు చేతివాటం చూపించారని ప్రచారం జరిగింది.  

NTR Bharosa Pension: విజయనగరంలో పింఛన్ల పంపిణీపై జనసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పింఛన్ల పంపిణీకి తమను ఆహ్వానించకపోవడంపై టీడీపీ నాయకులతో జనసేన నాయకులు గొడవకు దిగారు.

NTR Bharosa Pension: కడప జిల్లా పొద్దుటూరులో వృద్ధులకు పంచాల్సిన పింఛన్‌ డబ్బులు రూ.4 లక్షలు దొంగతనానికి గురయ్యాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link