Chandrababu: సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర వేడుకలు ఎలా చేసుకున్నాడో తెలుసా?
కొత్త సంవత్సరం సందర్భంగా విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
కొత్త సంవత్సరం తొలి రోజున బుధవారం సీఎం చంద్రబాబు కూడా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి దగ్గరుండి స్వామిఅమ్మవార్ల దర్శనం చేయించారు.
దర్శనం అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబును వేద మంత్రోచ్ఛరణాలతో ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ముఖ్యమంత్రి, మంత్రులకు తీర్థప్రసాదాలు.. అమ్మవారి చిత్రపటం అందజేశారు.