Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

Thu, 07 Jan 2021-8:18 am,

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi), మరియు బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం చాలా తక్కువ ధరలో డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. భారతదేశంలో ఎయిర్‌టెల్, జియో, విఐ, మరియు బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) అందించే అత్యంత తక్కువ ధర డేటా ప్లాన్‌ల వివరాలు మీకోసం.

జియో రూ.199 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌స్, రోజుకు గరిష్టంగా 100 SMS లభిస్తాయి. మీరు జియో(Jio) యాప్స్‌కు కాంప్లిమెంటరీ సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

జియో రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, మీకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు గరిష్టంగా 100 SMS లభిస్తాయి.

Also Read: ​BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్! 

ఎయిర్‌టెల్ రూ. 14 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఉచిత SMSలు,  2GB డేటా లభిస్తుంది. 2 జీబీ డేటా అయిపోయిన తర్వాత, మీకు ఒక MBకి 0.50పైసలు ఛార్జ్ చేస్తారు. ఎయిర్‌టెల్(Airtel) రూ.179 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఉచిత SMSలు,  2GB డేటా లభిస్తుంది.

వోడాఫోన్  ఐడియా(Vi) రూ.149 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీతో 3 GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, మొత్తం 300 SMS లభిస్తాయి.  రూ. 219 ప్లాన్ అయితే రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు. 

Also Read: SBI గుడ్ న్యూస్.. ఇకనుంచి వారికి ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.187 ప్లాన్..  28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, 250 కాల్స్, 100 SMS ప్రతిరోజూ లభిస్తాయి. ఈ BSNL ప్లాన్‌తో ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (PBRT)ను కూడా పొందుతారు.

బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 247 ప్రీపెయిడ్ ప్లాన్.. 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3GB డేటా వరకు హై-స్పీడ్ బ్రౌజింగ్‌తో అపరిమిత డేటాను కూడా పొందుతారు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link