Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
Countries Without Income Tax: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పన్ను స్లాబ్‌లో ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కలించలేదు. వ్యక్తిగత పన్ను అనేది ప్రతి వ్యక్తి సంపాదనపై విధిస్తారు. అయితే వ్యక్తిగత సంపాదనపై ఎటువంటి పన్ను వసూలు చేయని కొన్ని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా? ఎలాంటి ఆదాయపు పన్ను(Income Tax) చెల్లించనవసరం లేని 7 దేశాల వివరాలు మీకోసం.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో తగ్గిన Gold Rates, క్షీణించిన Silver Price
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లో కార్పొరేట్ ట్యాక్స్‌ను ఆయిల్ కంపెనీలు, విదేశీల బ్యాంకుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రజల నుంచి ఎలాంటి వ్యక్తిగత పన్ను వసూలు చేయరు.
బహమాస్‌లో ప్రజలు ఎలాంటి వ్యక్తిగత పన్ను చెల్లించరు. ఈ కరేబియన్ దేశంలో ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్‌లను వసూలు చేయడం లేదు.
ఖతార్‌లో ప్రజల నుంచి ప్రభుత్వం ఏ వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు చేయదు. కంపెనీలకు కొంతమేర పన్నులు విధిస్తుంది.
మీరు కువైట్‌లో నివసిస్తున్నారా.. అయితే ఈ పౌరులు సైతం పన్ను మినహాయింపు పొందుతారు. ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఊరట కలిగిస్తోంది.
Also Read: Budget 2021: మీకు ఆదాయం లేకపోయినా సరే ఈ పన్నును చెల్లించక తప్పదు
ఒమన్ దేశంలో స్థానికులతో పాటు నాన్ రెసిడెంట్స్ నుంచి సైతం ఇక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ వసూలు చేయరు.
పనామా దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్నుతో పాటు కంపెనీ ట్యాక్స్ కూడా లేదు. అయితే కొన్ని విషయాలలో మాత్రమే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
పౌరుల నుంచి మొనాకో ప్రభుత్వం ఎలాంటి పన్ను వసూలు చేయదు. అక్కడ ఆరు నెలలు నివసిస్తే చాలు అక్కడ రెసిడెంట్‌గా మారిపోయే అవకావం ఉంది. అప్పటినుంచి మీ నుంచి పన్ను వసూలు చేయరు.