Chikungunya: చికున్ గున్యా నుంచి త్వరగా కోలుకోవడానికి ఇంటి వైద్యం.. ఇలా చేస్తే 3 రోజుల్లో నొప్పులు మాయం..
చికున్ గున్యాతో బాధపడుతున్నవారికి తీవ్ర ఒళ్లు నొప్పులు ఉంటాయి. సరిగ్గా నడవలేకపోతారు కూడా. ఒంట్లో నీరసం కొన్ని రోజులపాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెంగీ, మలేరియా, చికున్ గున్యా బారిన పడుతున్నారు.
సాధారణంగా చిన్న పిల్లలకు అయితే, చికున్ గున్యా వస్తే పెయిన్ కిల్లర్స్ మాత్రలు ఇస్తారు. ఇది డెంగీ అంత ప్రమాదం కాకున్నా ఇమ్యూనిటీ లేకుంటే తీవ్ర బలహీనపడతారు. అయితే, మీ ఆహారంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు చేర్చుకోవాలి.
అయితే, వేడి నీటితో స్నానం చేయాలి. ఆ నీటిలో వేప ఆకులు వేసి స్నానం చేస్తూ ఉండాలి.లేకపోతే తులసి ఆకులు కూడా ఉపయోగించవచ్చు. వేడి నీటిలో ఉప్పు వేసి స్నానం చేసినా ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ఇది సహజ సిద్ధంగా పనిచేస్తుంది.
స్నానం చేసే నీటిలో పసుపు కూడా వేసుకోవచ్చు. లవంగం నూనెతో నొప్పి ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయాలి. ఎక్కువగా మెట్లు ఎక్కడం మానుకోవాలి. అలాగే మీకు ఏమైనా వ్యాయామం చేసే అలవాటు ఉంటే ఈ సమయంలో మానుకోవాలి.
డైట్‌లో కూడా మార్పులు తప్పనిసరి. విటమిన్ డీ, క్యాల్షియం ఉండే ఆహారాలు, సప్లిమెంట్లు డైట్‌లో చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా చికున్ గున్యా లక్షణాల నుంచి బయట పడతారు. ఆరోగ్యం ఏ మాత్రం దిగజారినట్లు అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.