First Airship: తొలి మానవ సహిత ఎయిర్‌షిప్ ట్రయల్ రన్‌లో చైనా సక్సెస్
ఎయిర్‌షిప్ సామర్ధ్యం
ఈ ఎయిర్ షిప్ AS 700 ఓ విధమైన మానవ సహిత క్యాప్యూల్ విమానం. ఇందులో పైలట్ తో పాటు గరిష్టంగా 10 మంది వెళ్లవచ్చు. టేకాఫ్ బరువు గరిష్టంగా 4,150 కిలోలు. గరిష్టంగా 700 కిలోమీటర్లు ప్రయాణించగలదు
13 గంటలపాటు ప్రయాణం
ఈ సందర్భంగా ఈ విమానం 1000 కిలోమీటర్ల ప్రయాణానికి 12 గంటల 44 నిమిషాలు తీసుకుంది. గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో 500 నుంచి 1990 మీటర్ల ఎత్తులో ప్రయాణించింది
మధ్యలో రెండు విమానాశ్రయాల్లో స్టాప్స్
ఎయిర్‌షిప్ AS 700 మంగళవారం ఉదయం చైనాలోని హుబేయీ ప్రాంతంలోని జింగ్‌మేన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. మద్యలో రెండు విమానాశ్రయాల్లో హాల్ట్ ఇచ్చింది. బుధవారం మద్యాహ్నం దక్షిణ చైనాలోని గుయిలిన్ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది
దాదాపు 1000 కిలోమీటర్ల ప్రయాణం
చైనాలోని అగ్రగామి విమానయాన సంస్థ ప్రకారం ఈ ఎయిర్‌షిప్ దాదాపుగా 1000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది చైనాలోని డొమెస్టిక్ విమానయానంతో పోలిస్తే ఎక్కువే.
చైనా నిర్మిత సివిల్ ఎయిర్‌షిప్ AS 700
ఏవియేషన్ ఇండిస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా వివరాల ప్రకారం చైనా స్వంతంగా AS 700 ఎయిర్‌షిప్‌ను నిన్న బుధవారం నాడు తొలిసారిగా ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. ఇది మనుషులతో కూడింది.
ఎయిర్‌షిప్స్ ఎన్ని రకాలు
ఎయిర్‌షిప్స్ లేదా క్యాప్సూల్స్ చాలా రకాలుంటాయి. కమర్షియల్ విమానం, చిన్న సైజు విమానం, యుద్ధ విమానం, హెలీకాప్టర్ రకాలు ఉంటాయి. వీటి ద్వారా సరుకు రవాణా వేగవంతమవుతుంది
ఎయిర్‌షిప్ అంటే ఏమిటి
ఎయిర్‌షిప్ లేదా ఎయిర్ క్యాప్సూల్ అంటే ఓ రకంగా విమానం లాంటిదే. గాలిలో ఎగురుతూ మనుషుల్ని లేదా గూడ్స్ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చగలవు. తక్కువ ఎత్తులోనే కంటి కన్పిస్తూ ఎగురుతుంటాయి.