Chinese Party: ఈ చైనా వాళ్లు చేసిదంతా చేసి ఎలా పార్టీ చేసుకుంటున్నారో చూడండి
ఇటీవలే బయటికి వచ్చిన ఈ చిత్రాలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. వేలాది మంది ఎలాంటి సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదు..
ముఖానికి మాస్కులేదు.. అసలు కరోనావైరస్ అంటే భయమే లేదు.. కోవిడ్-19 అంతం అయినట్టు పార్టీ చేసుకుంటున్నారు.
ఈ చిత్రాలు చూసి ప్రపంచం మొత్తం చైనాకు ఇంకా బుద్ధిరాలేదు అని నిందిస్తోంది.
వుహాన్ లొని మయా బీచ్ వాటర్ పార్క్ లో ప్రతీ ఏడాది ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.. ఈ సారి కూడా నిర్వహించగా వేలాది మంది అక్కడికి చేరుకున్నారు.
76 రోజులు లాక్ డౌన్ తరువాత జూన్ లో పార్కును మళ్లీ ప్రారంభించారు. అయితే పార్కులో కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించాల్సి ఉండగా...అంతకు మంచి ఎన్నో రెట్లు వచ్చారట.