Tamarind Leaves Benefits: పుల్లపుల్లగా ఉండే చింత చిగురు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలుసా..?
పల్లెటూర్లలో ఉన్న వారు లేదా సమ్మర్ హలీడేస్ రాగానే చాలా మంది తమ అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్తుంటారు. మధ్యహ్నా పూట పొలాలకు వెళ్తారు. కొందరి పొలాల్లో చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో చింత చిగురు కోతకు వస్తుంది. పచ్చగా లేతగా చింత చిగురు కన్పిస్తు ఉంటుంది.
చాలా మందికి చింత కాయలు, చింతపండ్లు తెలుసు. కానీ చింత చిగురుమాత్రం కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ చింత చిగురు తిన్న కూడా బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
ఇది నేచురల్ ఆంటి బయోటిక్ లాగా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని బెల్లీఫ్యాట్ ను దూరం చేస్తుంది. దీన్ని కొందరు వంటలలో కూడా ఉపయోగిస్తారు.
చింత చిగురును డైలీ ఫుడ్ లో ఉపయోగిస్తే అజీర్తి సమస్యలు దూరమైపోతాయి. చింత చిగురును రాత్రి పూట నీళ్లలో వేసుకుని పెట్టుకొవాలి. ఉదయంపూట ఆ నీళ్లను తాగితే గొంతు సమస్యలు, మంట, వాపు, అన్ని చిటికెలో దూరమైపోతాయి
కొందరికి పొట్టలో నులిపురుగుల సమస్య ఉంటుంది. ఇలాంటి వారు చింత చిగురును తింటే ఆ బాధలు దూరమైపోతాయి. ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది. చింతలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చింత చిగురును ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. రక్తప్రసరణ వేగాన్ని పెంచుతుంది. ఎముకలు గట్టి పడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్యలున్న వారు చింత చిగురు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు.Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)