Chiranjeevi: చిరంజీవి చేసిన ఆ పని వల్ల మా బతుకులు ఆగం అయ్యాయి.. స్టార్ హాస్పిటల్ అధినేత సంచలన వ్యాఖ్యలు..
చిరంజీవి కెరీర్ లో ‘ఠాకూర్’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అవినీతికి వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో హాస్పిటల్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ఈ సినిమాలో చనిపోయిన వ్యక్తికి హాస్పిటల్ లోని డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ సీన్స్ కు ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి. ఏదో కొంత మంది డాక్టర్లు చేసే పనితో మొత్తం డాక్టర్ల వ్యవస్థపై నమ్మకం పోయేలా చేసిందన్నారు డాక్టర్ గురువా రెడ్డి.
ఠాగూర్ సినిమాలో ఈ సన్నివేశం వల్ల డాక్టర్ల పై అప్పటి వరకు ఉన్న గౌరవం తగ్గిపోయిందన్నారు. అంతేకాదు ఈ సినిమాతో మా డాక్టర్ల జీవితం ఆగమాగమైందన్నారు.
సినిమాలో ఆ సీన్ ఎవరు రాశారో కానీ అప్పటి నుంచి మా జీవితాలు నాశనం అయ్యాయన్నారు గురువా రెడ్డి. ఆ సినిమా చూసిన వారు ఎవరైనా డాక్టర్లు ఎవరినైనా ఐసీయూలోకి తీసుకెళితే డబ్బులు కోసమే అనే భావన క్రియేట్ అయిందన్నారు. ఆ తర్వాత పేషంట్స్ చనిపోతే.. అందుకు మేము కారణం కాదనే విషయాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి డాక్టర్లకు ఏర్పడిందన్నారు.
మరోవైపు గురువా రెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి నాకు మంచి దోస్తు. ఆయనతో కలిసి ఎన్నోసార్లు కలిసి భోజనం చేసామన్నారు. అంతేకాదు ‘ఠాగూర్’ సినిమా గురించి ప్రస్తావించాము. ఆ సినిమా తర్వాత డాక్టర్ల బతుకు ఆగమైందన్నారు. మాపై నమ్మకం పోయేలా చేసిందన్నారు.
అయితే.. ఠాగూర్ సినిమాలో ఆ సన్నివేశం మరింత దారుణంగా ఉందట. ఆ తర్వాత చిరంజీవి జోక్యంతో కాస్త మార్పులు చేర్పులు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా చిరంజీవి వల్ల డాక్టర్లు బతుకులు ఆగమయ్యాయి. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.