Mothers Day 2023 : మదర్స్ డే స్పెషల్.. సెలెబ్రిటీల తల్లులు వీళ్లే.. పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో మాతృదినోత్సవం సందర్భంగా సెలెబ్రిటీలంతా కూడా పోస్టులు వేస్తున్నారు. తమ తమ మాతృమూర్తులను తలుచుకుంటూ పోస్టులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర తార వర్షిణి అయితే స్పెషల్‌గా తన తల్లితో కేక్ కట్ చేయించింది.

రకుల్ ప్రీత్ సింగ్ తన తల్లి గురించి చెబుతూ పోస్టులు వేసింది. తన చిన్నప్పటి నుంచి నా చేతిని పట్టుకుని నడిపించావ్.. ఇప్పటికీ అలానే నా వెంటే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నావ్ అంటూ తన తల్లి గురించి చెబుతూ పోస్ట్ వేసింది.

రాశీ ఖన్నా అయితే తన తల్లితో కలిసి సరదాగా గడిపిన క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేసింది. తల్లితో కలిసి ఊయల ఊగుతున్న ఫోటోలను షేర్ చేసింది. మదర్స్ డే విషెస్ చెబుతూ రాశీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కాజల్ అగర్వాల్ అయితే తన పెళ్లి నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది. తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెబుతూ కాజల్ తన వెడ్డింగ్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చిరంజీవి తన తల్లి అంజనమ్మ గురించి చెబుతూ.. ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేశాడు. ఈ మదర్స్ డేకి పవన్ కళ్యాణ్ కనిపించలేదు. దీంతో పాత ఫోటోను చిరంజీవి షేర్ చేశాడు.