Cholesterol: ఇది కొలెస్ట్రాల్ చివరి చుక్కను గ్రహించేస్తుంది.. మీ ఇంట్లో నిత్యం అందుబాటులో ఉంటుంది..
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సంబంధిత ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అందుకే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలి.
మన ఇంట్లో టమోటాలు నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇందులో ముఖ్యంగా లైకోపీన్ ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇది గుండె సమస్యలు మీ దరిచేరకుండా కాపాడుతుంది.
అంతేకాదు టమోటాల్లో విటమిన్ ఏ, సీ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి. ఇవి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి.
వైద్యుల ప్రకారం టమోటాలు డైట్‌లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. మీకు ఇది సులభంగా ఇంట్లో అందుబాటులో ఉండే ఆహారం కాబట్టి కొలెస్ట్రాల్ ఉన్నవారు టమోటాలు తినాలి.
టమోటాలతో రకరకాల వంటకాలు తయారు చేస్తాం. ముఖ్యంగా కూరలు, సలాడ్‌లు తయారు చేసుకుంటాం. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కాకుండా బ్యూటీ రొటీన్‌లో కూడా టమోటాలు వినియోగిస్తారు.
మన శరీరంలో మనం తీసుకునే ఆహారం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు నియంత్రించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అవి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
వీలైనంత వరకు ఎక్కువ శాతం పండ్లు కూరగాయలు, ముఖ్యంగా సీట్రస్ ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలి. వీటి వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి.