Coconut embryo Benefits: షుగర్ పేషంట్లు కొబ్బరి పువ్వు తింటే..ఇన్సులిన్ అవసరమే ఉండదు
Coconut Seed : కొబ్బరికాయలో పువ్వు ఉంటుంది. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు ఆ పువ్వు కనిపిస్తుంది. తెల్లని గుజ్జులాంటి పదార్థం ఉంటుంది. దీన్ని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. కొబ్బరి పువ్వు, కొబ్బరి ముత్యం, కొబ్బరి మొలక ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. వేసవికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉంటాము. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి నింపుతుంది. కొబ్బరి పువ్వును ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం మరింత చల్లగా ఉంటుంది. ముఖ్యంగా కడుపులో చల్లదనం ఉంటుంది. కొబ్బరిలోని పువ్వు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం.
కొబ్బరి పువ్వు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. ఇందులో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పువ్వులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కొబ్బరి పువ్వు తింటే ఆయాసం, నీరసం వంటి సమస్యలు నయమవుతాయి.
కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొబ్బరి పువ్వు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహానికి సంబంధించిన లక్షణాలను మెరుగుపరుస్తుంది.
కొబ్బరి పువ్వును తినడం ద్వారా ఫ్రీ రాడికల్స్‌ను తొలగిపోయి క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. థైరాయిడ్ వ్యాధిని నివారించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది.
కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగానూ, ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు తింటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నయమవుతుంది.అలాగే ఇది కిడ్నీ సమస్యల నుంచి కూడా బయటపడేస్తుంది.
కొబ్బరి పువ్వులో పెద్ద మొత్తంలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ పేగులు శుభ్రం అవుతాయి. తద్వారా మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దీంతో పాటు ఇందులో చెడు కొలెస్ట్రాల్ తొలగించే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.