Mars - Jupiter conjunction: కుజ, గురు గ్రహాలు కలయిక.. ఈ రాశుల వారికి 42 రోజులపాటు డబ్బే డబ్బు..

Sun, 14 Jul 2024-2:37 pm,

కుజ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ గ్రహం ఇటీవలే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేసింది. ఇప్పటికే గతంలో వృషభ రాశిలో గృహస్పతి గ్రహం సంచార దశలో ఉంది. దీంతో రెండు గ్రహాల సంయోగం జరిగింది. ఈ సంయోగం ఆగస్టు 25 వరకు ఇలానే కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.   

కుజుడు, బృహస్పతి గ్రహాల కలయిక కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారు లాభాలు పొందితే మరికొన్ని రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారు. 

కుజ బృహస్పతి గ్రహాల కలయిక ఆగస్టు 25 వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే ప్రత్యేకమైన ప్రభావం ఆ తేదీ వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.  

బృహస్పతి అంగారక గ్రహం కలయిక కారణంగా సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పెట్టుబడును పెట్టడం వల్ల రెట్టింపు లాభాలను పొందుతారు. అలాగే విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. 

 

అలాగే ఉద్యోగం చేస్తున్న సింహ రాశి వారు కార్యాలయాల్లో సీనియర్ల సపోర్టు లభించి అన్ని పనులు ఎంతో తొందరగా చేయగలుగుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తు లభిస్తుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.   

ఈ సంయోగం కారణంగా కర్కాటక రాశి వారికి కూడా చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారు ప్రశంసలు పొందుతారు. అలాగే జీతాలు పెరిగి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. 

ఇక కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా భాగస్వామ్య జీవితం గడిపే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. భార్య సపోర్టు లభించి చిన్న చిన్న సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.   

వృషభ రాశి వారికి కూడా బృహస్పతి కుజ గ్రహాల కలయిక ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పెండింగ్ లో ఉన్న ప్రతి పని పూర్తవుతుంది. దీంతో పాటు కొత్త పనులు ప్రారంభించే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా తొందరగా చేయగలుగుతారు. 

అలాగే వృషభ రాశి వారికి సంపాదనలో మార్పులు వచ్చి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. దీంతోపాటు ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ప్రేమ జీవితం గడుపుతున్న వారికి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link