Health Tips: హోటళ్లలో తిన్న ఆహారమేకాదు.. ఇలా చేస్తే ఇంట్లో వండుకున్నా అనారోగ్యం బారినపడతారు..
ఉప్పు .. సాధారణంగా మనం వంట చేసేటప్పుడు కూరకు సరిపోయే ఉప్పును వేస్తాం. అయితే, ఒక్కోసారి అదనపు ఉప్పును ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల హైబీపీ, కిడ్నీ ,గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఉప్పు రుచిని పెంచుతుంది అని అధిక మోతాదులో తీసుకోకూడదు.
డిప్ ఫ్రై.. మనం తీసుకునే ఆహారాలు ముఖ్యంగా కూరలు వంటివి ఎక్కువ రుచి అవుతుంది అని చాలామంది డిప్ ఫ్రై చేస్తారు. ఇది కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ డిప్ ఫ్రైడ్ ఆహారం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇది ఆక్సీకరణం చెందుతుంది. కడుపులో ట్రాన్స్ ఫ్యాట్‌గా మారుతుంది. దీనివల్ల గుండె, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. తరచూ పప్పు చారు, రసం వంటివి డైట్లో చేర్చుకోవాలి. దీంతో సులభంగా జీర్ణం కూడా అవుతుంది.
స్మోక్.. స్మోక్ కుకింగ్ వంట పద్ధతులను కొందరు అనుసరిస్తారు. ఇది కూడా ఆరోగ్యానికి హానికరం. దీనివ్లల పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్, హెచ్‌సీఏ వంటి హానికరమైన రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. ఫలితంగా ఇవి క్యాన్సర్ కారకమైనవి. అందుకే ఈ పద్ధతుల్లో వండటానికి దూరంగా ఉండాలి.
మైక్రోవేవ్.. ఆహారం విషపూరితంగా మారడానికి మైక్రోవేవ్‌లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. 2011లో డబ్ల్యూహెచ్ అధ్యయనం ప్రకారం క్యాన్సర్ కారకాలను ఆహారంలోకి చేరవేస్తుందని వెల్లడించింది. ఎక్కువ శాతం ఇలా వండుకోకుండా మైక్రోవేవ్ కంటే స్టవ్‌పై నేరుగా వండుకోవాలి.
స్వీట్లు..
కొంతమంది ఆహారం తీసుకోగానే తిన్న వెంటనే స్వీట్లు తీసుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా స్వీట్లు, జ్యూస్‌లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. దీంతో ఊబకాయం, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది. ఇది కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.