DA Hike: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. భారీగా జీతాలు పెంపు, వివరాలు ఇవే..!
ఒక్కో పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల హామీ నేపథ్యంలో ఈ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీబస్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్నాయి.
అంతేకాదు రేవంత్ సర్కార్ రూ.500 బోనస్ సన్నవడ్లపై ప్రకటించింది. ఇదిలా ఉండగా రానున్న 26వ తేదీ రేవంత్ సర్కార్ కీలక సమావేశం జరగనుంది. ముఖ్యంగా ఈ కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు రేవంత్ ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో రైతు భరోసా పథకం గురించిన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15000 ఏడాదికి రైతులకు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై విధివిధానాలు అమలుకు నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, రేషన్ కార్డు లేని రైతులకు కూడా రైతు భరోసా అందించేలా నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వారికి దీపావళి కానుకగా డీఏ పెంపుపై కీలక చర్చలు జరిగిన తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇటీవలె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇది పండుగ ముందు వారికి భారీ ప్రయోజనాలు తెచ్చింది. దీంతోపాటు 3 నెలల బకాయిలు కూడా చెల్లించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కెబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఉద్యోగులు డీఏ పెంపునకు ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశంలో ప్రకటిస్తే పండుగ ముందే ఉద్యోగులకు తీపికబురు అందుతుంది. ఇప్పటి వరకు ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లు, పెన్షనర్లకు 3 నెలల డీఏ బకాయిలు ఉన్నాయి.