Daily Horoscope 2024: సెప్టెంబర్ 20 రాశిఫలాలు: ఈ రాశులవారికి విపరీతమైన అదృష్టం, ధన ప్రవాహం..

Fri, 20 Sep 2024-1:49 am,

మేష రాశి: ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సులువుగా బయటపడుతారు.అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు. భూ, కారు వంటి వాటిని కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఆంజనేయ దండకం చదవడం మంచిది. తెలుపు, ఎరుపు దుస్తులు ధరించడం శుభప్రదం. 

వృషభ రాశి: వృషభ రాశివారికి భూ సంబంధించిన వివాదాలు తొలుగుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కలుగుతాయి. విష్ణుమూర్తిని దర్శించుకోవడం మంచిది. తెలుపు రంగు వస్త్రాలు మంచిది.  

మిథున రాశి: అప్పుల భారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన సమయం. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టదైవారధన చేయడం శుభప్రదం. ధరించాల్సిన రంగులు నేరేడు వర్ణం. 

కర్కాటక రాశి: ఈ రాశివారికి ఎంతో శుభప్రదమైన రోజు. రాజకీయ నాయకులకు కష్టాలు తీరుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు నీలం రంగు వస్త్రాలను ధరించడం మంచిది. అంగారక స్తోత్రం చదవడం వల్ల లాభాలు పొందుతారు. 

 

సింహ రాశి: కొత్త ఉద్యోగాలకు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విద్యార్థులు చదువులో ప్రగతి ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఈ రాశివారు గణపతిని దర్శించుకోవడం మంచిది. లేత గులాబీ రంగు మంచి ఫలితాలను కలుగుతాయి. 

కన్య రాశి: ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబం లేదా స్నేహితులతో కొంత సమయం గడపడం మంచిది. నిరుద్యోగులకు మంచి రోజులు వస్తున్నాయి. ఖర్చులు పెరినప్పటికి అవసరాలకు డబ్బులు అందుతాయి. ఎరుపు రంగు మంచిది. శ్రీ రామ చంద్ర స్వామిని పూజించడం మంచిది.   

తుల రాశి: చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా స్థిరత్వం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు కలిగే కాలం. వృత్తి, ఉద్యోగాల్లో  ప్రశంసలు అందుకుంటారు. ఆకుపచ్చని రంగు మంచిది. శివాష్టకం చదవడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి.   

వృశ్చిక రాశి: ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన కొన్ని చర్చలు జరుగుతాయి.  ఉద్యోగంలో శ్రమకు తగినంత ఫలితం దక్కుతుంది. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పసుపు రంగు చాలా మంచిది. గురు గ్రహంను పూజించండి.   

ధనస్సు రాశి: అనుకూలమైన సమయం. కొత్త వాహన్నాని కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ లాభాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ధరించాల్సిన రంగు నీలం, దుర్గా దేవిని స్మరించడం ఎంతో ఉత్తమం. 

మకర రాశి: ఇతరలు నుంచి రావాల్సిన డబ్బు వెంటనే అందుతుంది. వాహనాలు, భూ, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో మంచి పేరు పొందుతారు. ఎప్పటి నుంచో ఉన్నా కొన్ని వివాదాలకు పరిష్కారం దక్కుతుంది. గులాబీ, పసుపు ధరిచడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శివుడిని పూజించడం మంచిది. 

కుంభ రాశి: ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇతరులను నమ్మడం మంచిది కాదు. ఆర్థికంగా మెరుగుపడుతారు. విద్యార్ధాలు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఎరుపు, పసుపు ధరించండి. నవగ్రహ స్తోత్రాలు పటించడం మంచిది.   

మీన రాశి: మీన రాశి వారు ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. కష్టానికి తగినంత ఫలితం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్‌ వంటి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆకుపచ్చ రంగు ధరించండి. కనకధారా స్తోత్రాన్ని జపం చేయడం మంచిది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link