Darshan: దర్శన్, సల్మాన్, సంజయ్ సహా జైలు కెళ్లిన సినిమా స్టార్స్ వీళ్లే..

Tue, 02 Jul 2024-7:51 am,

తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. కొత్త చట్టాల ప్రకారం ఇతనికి 10 యేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయి.

బాలీవుడ్ బ్యాడ్ బాయ్ .. ఖల్ నాయక్  పేరుకు తగ్గట్టు 1993 అక్రమాయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంతో కోర్టు ఇతన్ని ఐదేళ్ల శిక్ష విధించింది. జైలు శిక్ష తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

 

1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్లూను దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల శిక్ష విధించింది. కొన్నేళ్లు ఈ కేసులో సల్మాన్ జైలు జీవితం గడిపారు. డబ్బు, పలుకుపడి, సెలబ్రిటీ హోదా కారణంగా  ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. 

ఒక పర్సన్ ను కారణం లేకుండా కొట్టినందున సైఫ్ అలీ ఖాన్ జైలు కెళ్లాల్సి వచ్చింది.

 

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా.. పోర్న్ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ పోర్న్ రాకెట్ బాలీవుడ్ లో సంచలనంగా మారింది.

ఒక మ్యాగజైన్ కవర్ పేజీపై ఓ మతాన్ని కించపరిచినందున సోనాలి బింద్రే జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత కోర్టు బెయిల్ పై విడుదలైంది. అటు డైరెక్టర్ మధుర్ భండార్కర్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై  జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

డ్రగ్స్ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు ఫర్దీన్ ఖాన్. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అటు నటుడు షైనీ ఆహూజా తన ఇంట్లో పనిచేసే వ్యక్తిపై అత్యాచారం చేసిన కారణంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

 

అక్రమ పాస్ పోర్ట్ కలిగి ఉన్నందకు తన లవర్ అబూ సలేంతో కలిసి మోనికా బేడి జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

ఓ ఫ్యాషన్ వీక్ లో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా జైలు పాలైన అక్షయ్ కుమార్.. ఆ తర్వాత వెంటనే బెయిల్ పై వెంటనే విడుదలయ్యారు.

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయిన సంగతి తెలిసిందే కదా.

రాష్ డ్రైవింగ్ కారణంగా జాన్ అబ్రహం 15 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

 

టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్..పోర్నోగ్రఫీ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు. ఆ కేసులో ఆయన్ని అక్రమంగా ఇరికించారని తేలడంతో నిర్ధోషిగా విడుదలయ్యారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link