Deepika Padukone Baby Bump Photos: దీపికా పదుకొణే బేబి బంప్స్ ఫోటోస్.. సోషల్ మీడియాలో వైరల్..

Wed, 31 Jul 2024-10:07 am,

దీపికా పదుకొనే కొన్నేళ్ల క్రితం తన తోటి నటుడు రణ్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన దాదాపు నాలుగేళ్లకు దీపికా పదుకొణే  తల్లి కాబోతుంది. అంతేకాదు తను గర్భంతో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.

దీపికా పదుకొణే సెప్టెంబర్ లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు ఆ దంపతులు మీడియాకు తెలిపారు. కొంత మంది జ్యోతిష్యులు మాత్రం వారిద్దరి జాతకాలను పరిశీలించి దీపికాకు మగబిడ్డకు జన్మినిస్తుందని చెబుతున్నారు.

దీపికా పదుకొణే తాను గర్భవతి అని తెలియగానే.. చేతిలో ఉన్న అన్ని సినిమాలను పూర్తి చేసింది. అంతేకాదు ఇప్పటికే ఈమె కుటుంబ సభ్యులు సంప్రదాయ బద్ధంగా ఆమెకు సీమంతం కూడా నిర్వహించారు.

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అంతేకాదు కొన్నాళ్లు తన పూర్తి సమయాన్నిబిడ్డకే కేటాయించాలని డిసైడ్ అయింది.

దీపికా పదుకొణే 2006లో ఉపేంద్ర హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘ఐశ్వర్య’ తో వెండితెరకు పరిచయమైంది. 2007లో ఆమె షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత నుంచి దీపికా ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

దీపికా పదుకొణేకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 80 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నటిగా ఈమె క్రేజ్ కు ఇది నిదర్శనం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link