Deepika Padukone Sister: దీపికా పదుకొణే చెల్లెలును చూసారా..! గ్లామర్ లో అక్కకు గట్టి పోటీ ఇస్తున్న భామ..

Mon, 06 Jan 2025-7:35 am,

అన్ని ఇండస్ట్రీస్ లో వారసత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇక దీపికా పదుకొణే చెల్లెలు అక్కలా హీరోయిన్ కాకుండా.. నాన్న బాటలో  పెద్ద బాట్మింటన్ తో పాటు  గోల్ఫ్ ప్లేయర్ గా రాణిస్తోంది.

దీపికా పదుకొనేకు ఓ చెల్లెలు ఉంది. ఈమె పేరు అనీషా పదుకొనే. వీళ్ల మధ్య 5 యేళ్ల వ్యత్యాసం ఉంది. వీరిద్దరి చైల్డ్ హుడ్  అంతా ఐటీ నగరం బెంగళూరులో గడిచింది. అనీషా బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసింది 

దీపికా పదుకొణే సోదరి అనీషా పదుకొణే.. 2 ఫిబ్రవరి 1991 బెంగళూరులో జన్మించింది. పన్నెండెళ్ల వయసు నుంచే ఈమె గోల్ఫ్ తో పాటు బాట్మింటన్ లో రాణిస్తోంది. ఈమె బయట ఎక్కువగా కనిపించదు. లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది.

ప్రస్తుతం అనిషా పదుకొణే.. దీపికా ప్రారంభించిన ‘ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ సీఈవో గా సామాజిక బాధ్యత నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారా డబ్బులేని ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నారు.

అనిషాకు తన కంటూ ప్రత్యేక అభిమానులున్నారు. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీపికా పదుకొణె చెల్లెలు అనీషా పదుకొణె లాస్ట్ ఇయర్ ఎంతో ప్రెస్టీజియస్ అవార్డ్ అయిన ‘షీ స్పార్క్స్’ అవార్డును కైవసం చేసుకుంది.

దీపికా చెల్లెలు  కేవలం గోల్ఫ్ క్రీడలోనే  కాదు..క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తో పాటు హాకీలో కూడా రాణిస్తోంది అనీషా. దీపికా విషయానికొస్తే.. లాస్ట్ ఇయర్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో పాటు అజయ్ దేవ గణ్, రోహిత్ శెట్టిల ‘సింగం ఎగైన్’ మూవీతో పలకరించి హిట్స్ ను అందుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link