Hyderabad Job Fair: మహిళల కోసం ప్రత్యేక జాబ్ మేళా.. 25 కంపెనీలు, 1,000 ఖాళీల భర్తీ ఇలా అప్లై చేసుకోండి..

Wed, 07 Aug 2024-11:59 am,

మహిళలకు బంపర్‌ ఆఫర్. కేవలం వీరికి మాత్రమే జాబ్‌ ఆఫర్. ఇందులో 25పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఇది మన హైదరాబాద్‌లో రేపు అంటే గురువారం 8వ తేదీనా నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్‌ మేళా వివరాలు తెలుసుకుందాం.  

ఇందులో వెయ్యికి పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్‌ మేళాకు ssc నుంచి ఆ పైన చదువుకున్నవారు అర్హులు. అయితే, దీనికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. మీరు జాబ్‌ కొట్టే మంచి ఆఫర్. తెలంగాణ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ (DEET) ఈ వెకెన్సీల భర్తీని చేపట్టింది.   

ప్రత్యేకంగా మహిళల కోసం చేపట్టిన ఈ జాబ్‌ ఫెయిర్‌ గురువారం 8 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. తెలంగాణకు చెందిన మహిళలు అర్హులు. ఈ పెయిర్‌ ఫ్రీ. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో DEET, WE Hub Job Seeker అప్లికేషన్‌ ఫారమ్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.  

ఈ జాబ్‌ మేళాకు వెళ్లాలనుకునేవారు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. డాక్టర్‌ బీఆర్‌ అండేడ్కర్‌ ఓపెన్‌ యూనిశర్శిటీ క్యాంపస్, రోడ్‌ నం.45, మస్తాన్‌ నగర్, జుబ్లీహిల్స్, హైదరాబాద్‌-33. ఇప్పటికే 4 వేల మంది వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ జాబ్‌ మేళాలో ప్రఖ్యాత కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐకియా, రిలయన్స్ నిప్పో లైఫ్‌ ఇన్సూరెన్స్‌, మెడ్‌ప్లస్, టాటా మోటార్స్‌, మ్యాక్స్‌, గోపిజ్జా తో పాటు ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి.  

రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌ ముందుగానే పూర్తి చేయండి. ఇందులో మీ పేరు, మొబైల్‌ నంబర్‌ మీరు ఏం చదవుకున్నారు. అనుభవం, మీ మార్కులు, ఏ కంపెనీలు పనిచేశారు వంటి అన్ని వివరాలను నమోదు చేయాలి. మీరు ఏ లొకేషన్‌లో పనిచేయాలనుకుంటున్నారు కూడా అక్కడ నమోదు చేసి చివరగా రెజ్యూమ్‌ అప్లోడ్‌ చేయాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link