Bigg Boss OTT3: ఢిల్లీ వడా పావ్ అంగడి నుంచి బిగ్‌బాస్ ఓటీటీ 3 వేదిక వరకూ చంద్రికా దీక్షిత్ పయనం ఇదే
వివాదాల్లో చంద్రికా
చంద్రికా దీక్షిత్ వడా పావ్ అంగడి ఆలోచనతో ఆమె చుట్టూ వివాదాలు కూడా నెలకొన్నాయి. భార్యాభర్తలిద్దరూ వడా పావ్ పేరుతో ఆలూ టిక్కీలరు పావ్‌లో ఉంచి ఆమ్మేస్తున్నారంటూ కామెంట్లు చేసేవారు. కస్టమర్లు ఎవరైనా 4 కంటే ఎక్కువ వడా పావ్ అడిగితే ఆమె ఇవ్వకపోయేదట. దాంతో చాలామంది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు.
భర్తతో కలిసి వడా పావ్ అంగడి
చంద్రికాతో పాటు ఆమె భర్త యశ్ గేరా కూడా ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఢిల్లీలో వడా పావ్ అంగడి పెట్టాలనుకున్నారు. అంతే ఊహించని విధంగా సక్సెస్ అయింది. రుచి, క్వాలిటీ ఉండటంతో అందరూ ఎగబడ్డారు. ఆమెకు వంటలపై ఉన్న అభిరుచే ఆమెకు సంపాదన తెచ్చిపెడుతోంది.
హల్దీరామ్‌లో ఉద్యోగం
సోషల్ మీడియాలో తరచూ ఫేమస్ అయ్యే ఫుడ్ బ్లాగర్లలో చంద్రికా దీక్షిత్ ఒకరు. ఈమె అంగడి ముందు వడా పావ్ తినేందుకు పెద్దఎత్తున జనాలు క్యూలైన్లలో కన్పిస్తుంటారు. గతంలో చంద్రికా హల్దీరామ్‌లో పనిచేసేది. కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం వదలాల్సి వచ్చింది.
ఎవరీ చంద్రికా గేరా దీక్షిత్
వడా పావ్ అంటే ముంబై ప్రసిద్ధ డిష్. ముంబై జనాలు అత్యంత ఇష్టంగా తింటారు. కానీ ఇప్పుడీ వడా పావ్ ఢిల్లీలో కూడా అంతే ప్రాచుర్యం పొందింది. కారణం చంద్రికా గేరా దీక్షిత్. అందుకే ఈమెను ఢిల్లీ వడా పావ్ గర్ల్ అని పిలుస్తుంటారు. చంద్రికా ఢిల్లీలో వడా పావ్ బడ్డీ నిర్వహించేది. ఈమె చేసే వడా పావ్ తినేందుకు పెద్దపెద్ద క్యూ లైన్సు కన్పిస్తుంటాయి
ఢిల్లీ వడా పావ్ అంగడి నుంచి బిగ్‌బాస్ ఓటీటీ 3 వేదికకు
ప్రస్తుతం చంద్రికా దీక్షిత్ వడా పావ్ అంగడి నిర్వహించడం లేదు. కానీ లగ్జరీ లైఫ్ జీవిస్తోంది. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనిల్ కపూర్ రియాలిటీ షో బిగ్‌బాస్ ఓటీటీ 3లో తొలి కంఫర్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికై మరింత చర్చనీయాంశమౌతోంది. జూన్ 21 నుంచి బిగ్‌బాస్ ఓటీటీ 3 జియోలో స్ట్రీమింగ్ కానుంది.