Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను రేపటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో గతేడాది కూడా జూన్ లోనే పవన్.. వారాహి విజయయాత్రను ప్రారంభించారు. తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. అప్పట్లో ఈ వాహనం రంగు మీద తీవ్ర దుమారం చెలరేగింది.
గతంలో ఏపీ ప్రభుత్వం ఈ వారాహియాత్రకు అనేక ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించింది. అయినకూడా పవన్ వెనక్కు తగ్గకుండా.. వారాహి రథంపైన ఏపీలో జనసేన కోసం ప్రచారం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కూటమి కోసం ప్రచారం నిర్వహించి, అనూహ్యంగా వందశాతం స్ట్రైక్ రేట్ లో విజయం సాధించారు. ఈ క్రమంలో మరోసారి ఆయన వారాహి అమ్మవారి ఆశీర్వాదం కోసం రేపటి నుంచి దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రేపటి నుండి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నాడు. ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఎంతో కఠినంగా ఉపవాసం చేస్తున్నట్లు సమాచారం.
గతంలో వారాహి అమ్మవారి ఆశీర్వాదం వల్లనే.. తమకు భారీ మెజార్టీ వచ్చినట్లు జనసేన అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఆషాడ మాసం,మరోవైపు వారాహి అమ్మవారి పదకొండు రోజుల దీక్ష కొనసాగనుంది.
ఇదిలా ఉండగా.. జనపార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళి మొదలైన అంశాలపై డిప్యూటీ సీఎం తన ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.